Tuesday, 3 November 2026

May 2013

తెలంగాణ

పీటల మీద ఆగిపోయిన వివాహం

నల్లగొండ, జనంసాక్షి: వలిగొండ మండలం మొగలిపాకలో పీటల మీద వివాహం ఆగిపోయింది. తాళి కట్టే సమయంలో పెళ్లికి వరుడు నిరికరించాడు. దీంతో వధువు బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెళ్లికుమారుడిని మొగలిపాక గ్రామ పంచాయితీ వధువు బంధువుల నిర్బంధించారు.…

తెలంగాణ

పాణ్యం ఎమ్మెల్యేపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు

హైదరాబాద్‌ : కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో కర్నూలు జిల్లాకు చెందిన రాజేశ్వరి అనే మహిళ ఫిర్యాదు చేసింది. తనపై ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని…

తెలంగాణ

ఎస్‌టిలకు ప్రాధాన్యం లేదు: సూర్యనాయక్‌

హైదరాబాద్‌,జనంసాక్షి: ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌లో ఎస్‌సిలకు ఇచ్చింత ప్రాధాన్యత ఎస్‌టిలకు ఇవ్వడం లేదని ట్రైఫెడ్‌ ఛైర్మన్‌ సూర్యనాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సబ్‌ప్లాన్‌కు సంబధించిన కార్యక్రమాలు దళితవాడల్లో పెడుతున్నారు కాని గిరిజనవాడల్లో పెట్టడం లేదన్నారు. ఈ విషయంలో…

సీమాంధ్ర

రాగల 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం

విశాఖపట్టణం : రాగల 24 గంటల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్‌ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావం వల్ల…

తెలంగాణ

పాణ్యం ఎమ్మేల్యే రాంభూపాల్‌రెడ్డిపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు

హైదరాబాద్‌, జనంసాక్షి: కర్నూలు జిల్లా పాణ్యం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డిపై మహిళా సంఘం నేత మానవ హక్కుల కమిషనర్‌ (హెచ్‌ఆర్సీ) కు ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ మహిళా సంఘం నేత ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యాచారం…

జాతీయం

మంత్రుల బృందం సమావేశం వాయిదా

ఢిల్లీ : సహజవాయువు కేటాయింపు అంశానికి సంబంధించి ఏర్పాటుచేసిన మంత్రుల సాధికార బృందం (ఈజీఓఎం) సమావేశం వాయిదా పడింది. రక్షణమంత్రి ఏకే అంటోనీ అధ్యక్షతన ఈ సమావేశం జరగవలసి ఉంది.

తెలంగాణ

సైబరాబాద్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌ : మహిళల రక్షణ, చోరీల నివారణ, ట్రాఫిక్‌ నియంత్రణే తన ప్రాధాన్యాలని సైబరాబాద్‌ కొత్త పోలీస్‌ కమిషనర్‌ సీవీ అనంద్‌ అన్నారు. తాజా బదిలీల్లో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ పదవి నుంచి సైబరాబాద్‌ కమిషనర్‌గా వచ్చిన…

జాతీయం

స్పాట్‌ దోషులపై కఠిన చర్యలు: జైట్లీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు, బోర్డు క్రమశిక్షణ సంఘం సభ్యుడు అరుణ్‌ జైట్లీ తెలిపారు. స్పాట్‌ ఫిక్సింగ్‌పై నిర్ణీత గడువులోపుగా స్వుచ్చపూరిత వాతావరణంలో నిష్పక్షపాత…

తెలంగాణ

మహానాడుకు తరలిన తెదేపా నేతలు

బాన్సువాడ పట్టణం : హైదరాబాద్‌లోని గండిపేటలో నిర్వహించే మహానాడు కార్యక్రమానికి బాన్సువాడ నుంచి తెదేపా నేతలు తరలివెళ్లారు. తెదేపా నియోజకవర్గ ఇంఛార్జి బద్వానాయక్‌ అధ్వర్యంలో సుమారు 500 మంది వాహనాల్లో హైదరాబాద్‌కు బయలుదేరారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా విజయం…

తెలంగాణ

నలుగురు బుకీల అరెస్టు

హైదరాబాద్‌ : కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు బుకీలను పోలీసులు నేడు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ. 3.50 లక్షలు, 18 సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు.