Thursday, 5 November 2026

May 2013

తెలంగాణ

ఏ పదవికీ పోటీ చేయనని కడియం ప్రకటించాలి : ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : తెలంగాణ కోసమే కడియం శ్రీహరి తెదేపాను వీడితే ఏ పదవికీ పోటీ చేయనని ప్రకటించాలని తెదేపా నేత ఎర్రబెల్లి కోరారు. తెలంగాణకు తెదేపా అనుకూలంగా లేఖ ఇచ్చినా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైన మాట వాస్తవమేనని తెలిపారు.…

సీమాంధ్ర

మంత్రి పార్థసారథి కేసు విచారణ వాయిదా

విజయవాడ : మంత్రి పార్థసారథి ఎన్నికల అఫిడవిట్‌ కేసు విచారణ వచ్చే నెల 14కు వాయిదా పడింది. మంత్రి పార్థసారధి ఎన్నికల అఫిడవిట్‌ కేసు విచారణను మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు  వాయిదా వేసింది.

తెలంగాణ

ప్రజా సంక్షేమానికి కార్యకర్తలు కట్టుబడి ఉండాలి : బొత్స

హైదరాబాద్‌ : ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్‌ కార్యకర్తలందరూ కట్టుబడి ఉండాలని పీసీసీ అధినేత బొత్స పిలుపునిచ్చారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో జరుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రస్థాయి సదస్సులో బొత్స ప్రసంగించారు. పార్టీ బలోపేతానికి సూచనలు స్వీకరించేందుకే విస్తృత…

తెలంగాణ

పీసీసీ పేరిట వెబ్‌సైట్‌ ప్రారంభం

హైదరాబాద్‌ : ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ పేరిట రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్‌ స్టేడియంలో జరుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఏఐసీసీ పరిశీలకుడు కృష్ణమూర్తి ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. వెబ్‌సైట్‌ ద్వారా…

తెలంగాణ

పార్టీ విజయానికి కృషి చేస్తాం : మంత్రి దానం

హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేస్తామని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. పార్టీ రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన ప్రసంగించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాల్లో 20 గెలుస్తామని…

తెలంగాణ

ఫ్లెక్సీలో ఫోటో లేదని చిరంజీవి వర్గీయుల అసంతృప్తి

హైదరాబాద్‌, జనంసాక్షి: కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చింజీవి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు ఫ్లెక్సీల్లో చిరంజీవి ఫోటో లేకపోవడంతో మంత్రి వర్గీయులు నిరసన తెలిపారు. కాగా…

సీమాంధ్ర

యురేనియం ప్లాంటు ప్రాంతాల్లో శాస్త్రవేత్తల పర్యటన

కడప : కడప జిల్లా వేముల మండలంలో చేపట్టే యురేనియం ప్లాంటు ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్ల బృందం పర్యటిస్తోంది. ప్రజలతో సమావేశమైన ఈ బృందం యురేనియం కర్మాగారం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు వివరిస్తోంది. యురేనియం కర్మాగారానికి వ్యతిరేకంగా…

తెలంగాణ

కాంగ్రెస్‌ రాష్ట్ర స్థాయి సదస్సు ప్రారంభం

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర స్థాయి విస్కృత సదస్సు ప్రారంభమైంది. నగరంలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఈ సదస్సుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి , ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ, మంత్రులు…

సీమాంధ్ర

భీమవరం బస్టాండ్‌లో బంగారం అపహరణ

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బస్టాండ్‌లో ఓ ప్రయాణికురాలి వద్ద నుంచి బుధవారం ఉదయం 22 కాసుల బంగారాన్ని దుండగులు అపహరించుకుపోయారు. దీంతో బాధితురాలు పట్టణ పోలీసులు ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అంతర్జాతీయం

ఘుజియాబాద్‌లో దుండగుల దాడి.. ఏడుగురి మృతి

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘజియాబాద్‌ న్యూసిటీలో ఓ కుటుంబంపై మారణాయుధాలతో దుండగులు దాడికి దిగారు. ఈ దాడిలో ఆ కుటుంబంలోని ఏడుగురు మృతి చెందారు. ఆస్తి తగాదాలే ఈ ఘటనకు కారణమని బంధువులు అంటున్నారు. పోలీసులు ఘటనాస్థలికి…