Thursday, 5 November 2026

May 2013

తెలంగాణ

డైమండ్‌ ట్రాన్స్‌పోర్టు గోదాంలో అగ్నిప్రమాదం

అదిలాబాద్‌ జిల్లా : నగరంలోని తిరుపల్లి వద్ద డైమండ్‌ ట్రాన్స్‌పోర్టు గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. గోదాంలో ఉన్న పత్తిబేళ్లు తగలబడటంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సీమాంధ్ర

కడప కమిషనర్‌గా చంద్రమౌళీశ్వరరెడ్డి బాధ్యతల స్వీకరణ

కడప : తాగునీరు, పారిశుద్ధ్యంపై దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని కడప నూతన నగరపాలక కమిషనర్‌ చంద్రమౌళీశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నగర పాలక కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. నగర శివారులో విలీనం చేసిన ప్రాంతాలపై ప్రత్యేకంగా…

సీమాంధ్ర

నేటినుంచి రాష్ట్రంలో వంశధార సర్వే

శ్రీకాకుళం జిల్లా : వంశధార నదిలో జరుగుతున్న ఉమ్మడి సర్వేలో భాగంగా నేటినుంచి మన రాష్ట్ర భూ భాగంలో సర్వే ప్రారంభం కానుంది. నిన్నటితో ఒడిశా భూభాగంలో సర్వే పూర్తయిందని నేటినుంచి నేరడి బ్యారేజీకి దిగువన సుమారు 10…

సీమాంధ్ర

శ్రీవారి సేవలో న్యాయమూర్తి

తిరుమల : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుభాష్‌రెడ్డి ఈరోజు తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకుఆన్నరు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో న్యాయమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అలయ అధికారులు…

తెలంగాణ

సీమాంధ్ర పార్టీల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది: కడియం

వరంగల్‌, జనంసాక్షి: టీఆర్‌ఎస్‌లో తాను చిత్తశుద్ధితో చేరానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. పలువురు వివిధ రకాలుగా చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. ఇవాళ వరంగల్‌ మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పదవుల కోసం చేరలేదని తేల్చిచెప్పారు. తన వల్ల…

తెలంగాణ

ఉగ్రవాద హింసను ఎదుర్కొంటామని సచివాలయ ఉద్యోగుల ప్రమాణం

హైదరాబాద్‌ : నేడు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా సచివాలయ ఉద్యోగులందరితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ప్రతిజ్ఞ చేయించారు. సంప్రదాయమైన అహింస, సహనం పట్ల నిబద్ధతతో ఉంటామని, ఉగ్రవాద హింసను సర్వశక్తులు ఒడ్డి, అన్ని విధాలుగా…

సీమాంధ్ర

సింహాచలం వద్ద కొత్త గోశాలను సందర్శించిన మంత్రి

విశాఖజిల్లా : సింహాచలం వద్ద కొత్తగా ఏర్పాటుచేసిన గోశాలను మంత్రి సి. రామచంద్రయ్య సందర్శించారు. ఈ సందర్భంగా కోడెదూడల మరణాలు, అక్రమ తరలింపు తదితర విషయాలను అధికారులను అడిగి అయన తెలుసుకున్నారు.

తెలంగాణ

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై చేయిచేసుకున్న ఖాకీలు

ఆదిలాబాద్‌, జనంసాక్షి: సీమాంధ్ర పార్టీలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. విధిలో ఉన్న పోలీసులు అకారణంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమ్మయ్యపై పోలీసులు చేయి చేసుకున్నారు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల తీరుపై…

ఆదిలాబాద్

విజయమ్మను అడ్డుకున్న తెరాస కార్యకర్తలు

కాగజ్‌నగర్‌ పట్టణం, జనంసాక్షి: ఏపి ఎక్స్‌ప్రెస్‌లో వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కాగజ్‌నగర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో సిర్పూర్‌ (టీ) బయలుదేరుతుండగా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లు చౌరస్తా…

జిల్లా వార్తలు

తల్లి ఇంటిలోనే చోరీ కుమారుడి అరెస్టు

మిర్యాలగూడ, జనంసాక్షి: పట్టణంలోని కుండల బజారులో ఇటీవల తన తల్లి ఇంటిలోనే చోరీకి పాల్పడ్డ ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.38వేల నగదు 14న్నర తులాల బంగారం, రెండు కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు.