Friday, 6 November 2026

June 2013

తెలంగాణ

ఛలో అసెంబ్లీ సక్సెస్‌: టీడీపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఛలో అసెంబ్లీ సక్సెస్‌ అయ్యిందని టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నరసింహులు అన్నారు. సీఎం కిరణే పోలీసులతో అసెంబ్లీని దిగ్భంధించాలని చెప్పారు. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు.…

జాతీయం

శరద్‌యాదవ్‌తో ఏచూరి భేటీ

ఢిల్లీ : జనతాదళ్‌ (యు) అధ్యక్షుడు శరద్‌యాదవ్‌తో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.

Cover Story

అసెంబ్లీని ముట్టడిరచిన పోరు బిడ్డలు

కొదండరాం, విజయశాంతిసహ పలువురి నేతల అరెస్టు హైదరాబాద్‌ అష్టదిగ్భందం అసెంబ్లీ పై నల్లజెండా ఎగుర వేసి నిరసన తెలిపిన ఎమ్మెల్యేలు రేపు తలెంగాణ బంద్‌ కు కేసీఆర్‌ పిలుపు కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్‌ అరెస్టు హైదరాబాద్‌ : చలో అసెంబ్లీకి…

తెలంగాణ

లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన కమిషనర్‌

కరీంనగర్‌ జిల్లా : కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నగర పంచాయతీ కమిషనర్‌ వేముల దేవేందర్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధన శాఖ అధికారులకు చిక్కారు. ట్రాక్టర్‌ లీజు విషయమై రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు దేవేందర్‌ను…

తెలంగాణ

రేపు తెలంగాణ బంద్‌కు పిలుపు ఇచ్చిన ఓయూ జేఏసీ

హైదరాబాద్‌ ,(జనంసాక్షి): విద్యార్థుల అక్రమ నిర్భంధాలకు నిరసనగా ఓయూ జేఏసీ శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. అరెస్టు చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని ఓయూ జేఏసీ ఛైర్మన్‌ కిషోర్‌ డిమాండ్‌ చేశారు. కాగా మరోవైపు ఓయూ ఎన్సీసీ…

జిల్లా వార్తలు

జూనియర్‌ న్యాయవాదుల అరెస్టు

నాగోల్‌ :చలో అసెంబ్లీకి తరలివెళ్తున్న తెలంగాణ వాదులను అడ్డుకుంటున్నందుకు నిరసనగా రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు జూనియర్‌ న్యాయవాదులు అందోళన చేపట్టారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.

జిల్లా వార్తలు

ఎల్బీనగర్‌ చౌరస్తాలో ధర్నా 30 మంది అరెస్టు

నాగోలు: చలో అసెంబ్లీలో భాగంగా ఎల్బీనగర్‌ చౌరస్తాలో భాజపా నాయకులు స్వామిగౌడ్‌, యోగీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిల ఆధ్వర్యంలో 30 మంది ధర్నా చేశారు. వారిని ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్టు చేసి సమీపంలోని ఒక ఫంక్షన్‌హాలుకు తరలించారు.

తెలంగాణ

ఓయూ పీఎస్‌పై విద్యార్థుల రాళ్ల వర్షం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్శిటీలో ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఓయూ క్యాంపస్‌ పోలీస్‌ స్టేషన్‌పై విద్యార్థులు రాళ్ల వర్షం కురిపిస్తున్నారు. దాంతో పోలీసులు భాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. మరోవైపు ఇందిరా పార్క్‌ నుంచి చలో అసెంబ్లీకి తరలి వస్తున్న…

తెలంగాణ

సొమ్మసిల్లి పడిపోయిన తెరాస నేత శ్రవణ్‌

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇందిరాపార్క్‌కు చేరుకున్న తెరాస నేత శ్రవణ్‌ సొమ్మసిల్లి పడిపోయారు. శ్రవణ్‌తో పాటు అక్కడి చేరుకున్న తెరాస కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో తోపులాట జరిగింది. దీంతో రోడ్డుపై శ్రవణ్‌…

జాతీయం

ఆజాద్‌తో డీఎన్‌ భేటీ

న్యూఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పరిశీలకులు, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌తో పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ భేటీ అయ్యారు. తెలంగాణ అంశంతో పాటు పలు రాజకీయ అంశాలు వీరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.