Friday, 6 November 2026

June 2013

జాతీయం

సోనియాను కలిసిన గులాం నబీఆజాద్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీఆజాద్‌ కలిసినట్లు సమాచారం. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన ‘చలో అసెంబ్లీ ‘పై చర్చించినట్లు తెలుస్తుంది. రాష్ట్ర పరిస్థితులపై సోనియా ఆరా తీసినట్లు సమాచారం.…

తెలంగాణ

తెరాస ఎమ్మెల్యేలు, పోలీసులకు మధ్య తోపులాట

హైదరాబాద్‌ : గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో తెరాస ఎమ్మెల్యేలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీ అవరణలో ఆందోళనకు దిగిన తెరాస ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన అనంతరం గోల్కోండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గోల్కోండ పీఎస్‌లో తెరాస ఎమ్మెల్యేలు మాక్‌ అసెంబ్లీ…

తెలంగాణ

గాంధీలో వైద్యులను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌ : గాంధీ ఆసుపత్రి నుంచి ఇందిరాపార్కు వరకూ ప్రదర్శనగా బయలుదేరిన వైద్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం మూసివేసి వైద్యులను అక్కడే నిర్భంధించారు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా వైద్యులు నినాదాలు చేశారు.

జాతీయం

మోడీ వివాదంతో జేడీయూలో చీలిక

న్యూఢిల్లీ,(జనంసాక్షి): నరేంద్ర మోడీ వివాదంతో జేడీయూలో చీలిక ఏర్పడినట్లు తెలుస్తుంది. ఎన్టీయేతో ఇప్పటికిప్పుడు తెగదెంపులు లేవని జేడీయూ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ చెబుతుంటే, మరోవైపు నితీష్‌ కుమార్‌ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. బీహార్‌లో శనివారం జరిగే ర్యాలీలో…

వార్తలు

కోదండరాం, శ్రీనివాస్‌ గౌడ్‌ అరెస్టు

హైదరబాద్‌: చలో అసెంబ్లీ కి బయలుదేరిన తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మెన్‌ కోదండరాం, టీఎన్జీవోనేత శ్రీనివాస్‌ గౌడ్‌ను అశోక్‌నగర్‌ చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వైఖరికి నిరసనగా కోదండరాం ,శ్రీనివాస్‌గౌడ్‌లు రోడ్డు పైనే భైఠాయించి నిరసన…

తెలంగాణ

ఎంపీ విజయశాంతి అరెస్టు

హైదరాబాద్‌ : అసెంబ్లీలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన మెదక్‌ ఎంపీ విజయశాంతిని పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా విజయశాంతి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

తెలంగాణ

తెలంగాణ వాదులదే నైతిక విజయం

హైదరాబాద్‌,(జనంసాక్షి): పోలీసుల్ని మోహరింపచేసి ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ వాదులదే నైతిక విజయమని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ ప్రొఫేసర్‌ కోదండరామ్‌ అన్నారు. చలో అసెంబ్లీకి బయల్ధేరిన ఆయనను పోలీసులు అశోక్‌ నగర్‌ వద్ద అరెస్టు చేశారు. ఈ సందర్భంగా…

తెలంగాణ

కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్‌ అరెస్టు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీకి బయలుదేరిన తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం, టీఎన్టీవోనేత శ్రీనివాస్‌గౌడ్‌ను అశోక్‌నగర్‌ చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వైఖరికి నిరసనగా కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్‌లు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో…

తెలంగాణ

సీఆర్‌పీసీ నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌ :అరెస్టుల విషయంలో సీఆర్‌పీసీ నిబంధనలు పాటించాలని రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చలో అసెంబ్లీ సందర్భంగా అరెస్టులు, నిర్భంధాలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు అదేశాలు జారీ చేసింది.

తెలంగాణ

తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ సందర్భంగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా శాసనసభ ప్రధాన ద్వారం వద్ద అందోళనకు దిగిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌, కోత్తకోట దయాకర్‌తో…