Friday, 6 November 2026

June 2013

తెలంగాణ

ముగిసిన టీ ఉద్యోగుల జేఏసీ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఎన్టీవో భవన్‌లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సమావేశం ముగిసింది. చలో అసెంబ్లీపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణలో అప్రకటిత నిర్బంధకాండ కొనసాగుతున్నదని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని, అనుమతి…

సీమాంధ్ర

నలగాంపల్లిలో అగ్నిప్రమాదం

బంగారుపాళ్యం: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం నలగాంపల్లి వద్ద ఉన్న కేఎస్‌ఎస్‌ జ్యూస్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు రూ. 2కోట్ల విలువైన మామిడికాయలు, వాటిని నిల్వ ఉంచిన షెడ్లు కాలిపోయాయి. చిత్తూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది…

జాతీయం

ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది చిదంబరం

ఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని గతేడాది ఈ సమయంలో ఉన్నదానికన్నా ఇప్పుడు మెరుగ్గానే ఉందని ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. ద్రవ్యోల్బణం కూడా తక్కువగా ఉందన్నారు. త్వరలోనే మరిన్ని ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు చిదంబరం గురువారం ప్రకటించారు.…

జాతీయం

జియాఖాన్‌ ప్రియుడికి జ్యూడిషియల్‌ కస్టడీ

ముంబై,(జనంసాక్షి): బాలీవుడ్‌ నటి జియాఖాన్‌ ఆత్మహత్య కేసులో అరెస్టయిన ఆమె స్నేహితుడు , ప్రముఖ నటుడు ఆదిత్య పంచోలీ తనయుడు సూరజ్‌ పంచోలీకి స్థానిక కోర్టు ఈ నెల 27 వరకు జ్యడీషియల్‌ కస్టడీ విదించింది. నిన్నటి వరకు…

అంతర్జాతీయం

ధన్‌బాద్‌-పాట్నా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెన్‌పై మావోయిస్టుల దాడి

బీహార్‌: ధన్‌బాద్‌-పాట్నా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌పై మావోయిస్టులు దాడిచేసినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కాల్పుల్లో రైలు డ్రైవరుకు తీవ్రగాయాలైనట్లు సమాచారం.

తెలంగాణ

సభాపతికి లేఖపై తెదేపాను తప్పుబట్టిన మంత్రులు

హైదరాబాద్‌ : సభాపతికి లేఖ రాయడంపై మంత్రులు శ్రీధర్‌బాబు, కన్నా లక్ష్మీ నారాయణ, అనం రాంనారాయణరెడ్డి, రఘవీరా తదితరులు తెలుగుదేశం పార్టీని తప్పుబట్టారు. తెదేపా నేతలు సభాపతి వ్యవస్థను కించపరుస్తున్నారని మంత్రులు అరోపించారు. 13వ శాసనసభలో అందరికన్నా ఎక్కువ…

జాతీయం

ప్రపంచకప్‌ పుట్‌బాల్‌ పోటీల నిర్వహణకు కేంద్రం ఆమోదం

ఢల్లీి : అండర్‌ `17 ప్రపంచకప్‌ పుట్‌బాల్‌ పోటీలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఆమోదం తెలిపింది. 2017లో ఈ పోటీలను భారత్‌లో జరిపేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

జాతీయం

చలో అసెంబ్లీకి మద్దతు: రాజ్‌నాథ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): వీలేనంత త్వరలో కేంద్రం పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణపై కేంద్రం ఎప్పుడు బిల్లు పెట్టినా తాము మధ్మతు ఇస్తామన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి రాజ్‌నాథ్‌ సింగ్‌…

తెలంగాణ

డీజీపీని కలవనున్న ఎమ్మెల్యేల బృందం

హైదరాబాద్‌ : ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు తెరాస, భాజపా, సీపీఐ ఎమ్మెల్యేల బృందం డీజీపీ దినేశ్‌రెడ్డితో భేటీ కానుంది. చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి విషయమై వారు డీజీపీతో చర్చించనున్నట్లు సమాచారం.

అంతర్జాతీయం

ముషారఫ్‌ అరెస్టు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 2006లో అక్బర్‌ బుగ్తి హత్యకేసులో ముషారఫ్‌ను ఈరోజు అరెస్టు చేశారు. ముషారఫ్‌కు న్యాయస్థానం రెండువారాల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.