Thursday, 5 November 2026

June 2013

ఆదిలాబాద్

సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న భన్వర్‌లాల్‌

ఆదిలాబాద్‌ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భన్వర్‌లాల్‌ బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా బుధవారం రాత్రి బాసర చేరుకుని, ఈరోజు వేకువజామున అమ్మవారిని అభిషేక పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలంగాణ

ఏటీఎం చోరీ కేసులో నిందితుల అరెస్టు

హైదరాబాద్‌ : అమీర్‌పేటలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎటీఎం చోరీ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 13లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సనత్‌నగర్‌ పోలీసులు తెలిపారు.

తెలంగాణ

తెలంగాణ వాదుల అరెస్టుపై హెచ్‌ఆర్సీని ఆశ్రయిస్తా: హరీష్‌రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఛలో అసెంబ్లీ నేపథాన్ని పురస్కరించుకొని పలువురు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు , తెలంగాణవాదులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం పట్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి. హరీష్‌రావు గురువారం హైదరాబాద్‌ గురువారం హైదరాబాద్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ…

తెలంగాణ

ఓయు విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీకి బయలుదేరిన ఓయూ విద్యార్థులను ఎస్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఏర్పాటు చేసిన ఇనుప గేట్లను విద్యార్థులు తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు రాళ్లు రువ్వడంతో పోలీసులు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు.

తెలంగాణ

అభిప్రాయం చెప్పేందుకు హాజరవుతా: జానారెడ్డి

హైదరాబాద్‌ : బంగారు తల్లి పథకంపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘంలో సీఎం ఉండమన్నారని, తాను ఉండనని మంత్రి జానారెడ్డి చెప్పారు. కేవలం అభిప్రాయం చెప్పేందుకు మాత్రమే ఉపసంఘం సమావేశానికి హాజరవుతానని జానారెడ్డి వివరించారు.

తెలంగాణ

సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ఉపాధి అవకాశాలు

హైదరాబాద్‌ : సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు జైళ్లశాఖ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని హైదరాబాద్‌ జైళ్ల శాఖ డీఐజీ చంద్రశేఖర్‌ అన్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో కొన్నేళ్లుగా ఉంటూ సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాను పరిశీలించినట్లు చెప్పారు. ఈ జాబితాలో…

తెలంగాణ

ఆర్ట్స్‌ కళాశాల నుంచి ఓయూ విద్యార్థుల ర్యాలీ

హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్‌ కళాశాల నుంచి విద్యార్థుల ర్యాలీగా బయలుదేరారు. విద్యార్థుల ర్యాలీని అడ్డుకునేందుకు ఓయూ ఎస్‌సీసీ గేటు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఉద్రిక్తవాతావరణం నెలకొంది.

సీమాంధ్ర

పాఠశాల భవనాలు తనిఖీ చేయాలని మంత్రి ఆదేశం

అనంతపురం: పాఠశాల భవనాలు తనిఖీ చేయాలని విద్యాశాఖ అధికారులకు ప్రాథమిక విద్యాశాఖా మంత్రి శైలజానాథ్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల లేమిపై ‘ఈటీవీ’లో ప్రసారమైన కథనానికి స్పందించిన మంత్రి ఈమేరకు ఈమేరకు అదేశాలు జారీ చేశారు.

తెలంగాణ

సైబరాబాద్‌ పరిధిలో 15 వరకూ మద్యం దుకాణాల బంద్‌

హైదరాబాద్‌ : సైబరాబాద్‌ పరిధిలో నేటి నుంచి ఈనెల 15వ తేదీ ఉదయం వరకూ మద్యం దుకాణాలు మూసివేయాలని కమిషనర్‌ సీవీ అనంద్‌ అదేశాలు జారీ చేశారు. సైబరాబాద్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, సభలు,…

తెలంగాణ

హైకోర్టులో పిటిషన్‌ వేసిన అడ్వకేట్‌ జేఏసీ

హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా అక్రమంగా అరెస్టులు, బైండోవర్లు చేమడానికి సవాల్‌ చేస్తూ హైకోర్టులో అడ్వకేట్‌ జేఏసీ పిటిషన్‌ వేసింది. మధ్యాహ్నం ఈ పిటిషన్‌ విచారణకు రానుంది.