Thursday, 5 November 2026

June 2013

తెలంగాణ

అసెంబ్లీ ముట్టడికి టీడీపీ మద్దతు

హైదరాబాద్‌,(జనంసాక్షి): అసెంబ్లీ ముట్టడికి టీడీపీ తెలంగాణ ఫోరం మద్దతు ప్రటించింది. పార్టీ శ్రేణులంతా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటాయని టి. టీడీపీ నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు, రేవూరి ప్రకాశ్‌ రెడ్డి తెలిపారు. జేఏసీ స్వంతంత్రంగా వ్యవహరించాల్సిన…

తెలంగాణ

ఈనెల 17 నుంచి సీఎం సమీక్షా సమావేశాలు

హైదరాబాద్‌ : త్వరలో జరగనున్న స్థానిక సంస్థలకు పార్టీని సమాయత్తం చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 17 నుంచి 22 వరకూ ఈసమీక్షా సమావేశాలు జరగనున్నాయి.

తెలంగాణ

ఆర్టీసీ కార్మికసంఘాలతో చర్చలు విఫలం

హైదరాబాద్‌ : ఆర్టీసీలో తమ డిమాండ్ల సాధనకు సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలతో బస్‌భవన్‌లో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఒప్పంద కార్మికుల సర్వీసుల క్రమబద్ధీకరణ, వేతన సవరణలపై ఎటువంటి హామీ ఇవ్వలేదని ఈయూ, టీఎంయూ సంఘ…

అంతర్జాతీయం

యూపీ ఫలితాలే కీలకం :అమిత్‌షా

లక్నో, (జనంసాక్షి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో మంచి ఫలితాలు సాధిస్తే కేంద్రంలో ఎన్టీఏ ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటుందని బీజేపీ యూపీ పర్యవేక్షకుడిగా నియమితులైన గుజరాత్‌ మంత్రి అమిషా అన్నారు. బీజేపీ యూపీ ఇన్‌ చార్జిగా ఆయన…

అంతర్జాతీయం

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

ఎడ్జ్‌బాస్టస్‌ : ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది.

తెలంగాణ

విద్యుత్‌ నియంత్రణ మండలి ఛైర్మన్‌ ఎదుట నారాయణ బైఠాయింపు

హైదరాబాద్‌ : విద్యుత్‌ నియంత్రణ మండలి బహిరంగ విచారణలో ఈఆర్‌సీ ఛైర్మన్‌ ఎదుట సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ బైఠాయించి తన నిరసన వ్యక్తం చేశారు. ఎఫ్‌ఎస్‌ఏలు వేయవద్దని మొరపెట్టుకున్నా  ఈఆర్‌సీ పట్టించుకోవడం లేదంటూ పోడియం మందు ఆందోళనకు…

అంతర్జాతీయం

దక్షిణాఫ్రికాలో ఎన్నారై హత్య

డర్బన్‌, (జనంసాక్షి): దక్షిణాఫ్రికా ప్రవాసభారతీయుడొకరు కొడుకు చేతిలో హత్యకు గురయ్యాడు. బెంజమిన్‌ మూడ్లే(46) ను ఆయన కొడుకు డరేన్‌ పదయాచి కిరాతకంగా హత్య చేశాడు. ఛాతీ భాగంలో కత్తితో పొడిచి చంపాడు. ఉత్తర డర్బన్‌ లోని ఫోనిక్స్‌ ఇండియన్‌…

సీమాంధ్ర

ఏసీబీకి దొరికిపోయిన దేవ్‌పల్లి వీఆర్వో

విజయనగరం: బొండపల్లి మండలం దేవ్‌పల్లి వీఆర్వో మురళీధర్‌ ఓ రైతు వద్ద నుంచి రూ. 5వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. దేవ్‌పల్లి గ్రామానికి చెందిన మూకపల్లి తిరుపతిరావు అనే రైతుకు పట్టాదారు పాన్‌పుస్తకం జారీ చేసేందుకు రూ.…

తెలంగాణ

30 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు: జేసీ

హైదరాబాద్‌ : శాసనసభలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేదని కాంగ్రెస్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం చొరవ తీసుకుని సభ సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. అవసరమైతే తెరాస ఎమ్మెల్యేలను బయటకు…

సీమాంధ్ర

హెచ్‌పీసీఎల్‌ టెర్మినల్‌ వద్ద అధికారుల దాడులు

తూర్పు గోదావరి, గోకవరం మండలం గుమ్మలదొడ్డిలో హెచ్‌పీసీఎల్‌, ఐఓసీఎల్‌ టెర్మినల్‌ వద్ద తూనికలు కొలతల శాఖ అధికారులు దాడి చేశారు. తనిఖీల్లో ఒక్కొక్క వాహనంలో 10 నుంచి 18 లీటర్ల పెట్రోలు తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.