Wednesday, 4 November 2026

June 2013

తెలంగాణ

మెడికల్‌లో వెంకట్‌ వినీత్‌కు మొదటి ర్యాంకు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎంసెట్‌`2013 ఫలితాల్లో మెడికల్‌లో హైదరాబాద్‌లోని రామచంద్రపురానికి చెందిన వెంకట వినీత్‌ మొదటి ర్యాంకు సాధించాడు. విజయవాడకు చెందిన రోహిత్‌కుమార్‌ రెండో ర్యాంకు , జగదీశ్‌ రెడ్డి మూడో ర్యాంకు సాధించారు.

తెలంగాణ

ఇంజినీరింగ్‌లో మొదటి ర్యాంకు సాధించిన సాయిసందీప్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎంసెట్‌`2013లో ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన సాయి సందీప్‌రెడ్డి ఇంజినీరింగ్‌ విభాగంలో మొదటి ర్యాంకు సాధించాడు.

ఆదిలాబాద్

నిర్మల్‌లో భారీ వర్షం

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడిరది. దాంతో పలు చెట్లు విరిగి రోడ్లపై పడడంతో రాకపోకలు స్తంభించాయి. వర్షం వల్ల కొనుగోలు ధాన్యం తడిసిపోయింది.

తెలంగాణ

ఎంసెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్‌లో వచ్చిన మార్కులతో సహా ర్యాంకులను ప్రకటించారు.

జాతీయం

ఆజాద్‌తో రెండు గంటలపాటు సీఎం భేటీ

ఢల్లీి : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు గులాం నబీ ఆజాద్‌తో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలపాటు చర్చలు జరిపారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు. పీసీసీ కార్యవర్గం కూర్పు, పంచాయతీ ఎన్నికల నిర్వహణపై…

జిల్లా వార్తలు

17 మంది ఉపాధ్యాయులపై క్రిమినల్‌ కేసు

వరంగల్‌ జిల్లా : నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందిన 17 మంది ఉపాధ్యాయులపై పోలీసులు క్రిమినల్‌కేసు నమోదు చేశారు. మరో 8 మంది ఉపాధ్యాయులు పదోన్నతుల రద్దుకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

సీమాంధ్ర

బ్రేకులు విఫలమై జనాల మీదికి దూసుకెళ్లిన వ్యాను

విశాఖపట్నం : పూర్ణా మార్కెట్‌ ఏవీఎస్‌ కాలేజ్‌ సమీపంలో బుధవారం ఓ వ్యానుకు బ్రేకులు విఫలమై జనాల మీదకు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలవగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను కేజీహెచ్‌కి…

హైదరాబాద్

సీబీఐ కోర్టుకు వచ్చిన విజయసాయిరెడ్డి

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడైన విజయసాయిరెడ్డి కోర్టు ఉత్తర్వుల మేరకు లొంగిపోయేందుకు ఈ రోజు మధ్యాహ్నం సీబీఐ న్యాయస్థానానికి వచ్చారు.

జాతీయం

రాజ్‌కుంద్రాను ప్రశ్నిస్తున్న ఢల్లీి పోలీసులు

ఢల్లీి : ఐపీఎల్‌లో బెట్టింగ్‌, స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణాలకు సంబంధించి రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు యజమానుల్లో ఒకరైన రాజ్‌కుంద్రాను ఢల్లీి పోలీసులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ప్రశ్నించేటప్పుడు ఆ జట్టుకు చెందిన బౌలర్‌ సిద్ధార్థ్‌ త్రివేది కూడా కుంద్రా…