Thursday, 5 November 2026

July 2013

వార్తలు

రజతం గెల్చుకున్న లజ్జా గోస్వామి

స్పెయిన్‌: స్పెయినన్‌లో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌ పోటీల్లో భారత్‌కి చెందిన షూటర్‌ లజ్జా గోస్వామి రజత పతకం గెలుచుకుంది. ఇటలీకి చెందిన క్రీడా కారిణి స్వర్ణం గెలుచుకుంది. ఒలింపిక్‌ పతక విజేత విజయ్‌కుమార్‌ ఈ పోటీల్లో ఫైనల్స్‌కి…

తెలంగాణ

తెగిపోయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్వర్‌ కేబుల్‌

రంగారెడ్డి,(జనంసాక్షి): జిల్లాలోని శంకరపల్లిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్వర్‌ కేబుల్‌ తెగిపోవడంతో తాండూరులో బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలకు అంతరాయం కల్గింది. పలు ఏటీఎం సెంటర్లు, బ్యాంకులు, బ్యాడ్‌బాండ్‌ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.

సీమాంధ్ర

ఏటీఎం నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

రాజమండ్రి,(జనంసాక్షి): ఏటీఎం నగదు నిర్వహకుడి హత్య ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి 11మంది నిందితులపు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. కోట్ల మేర నగదును స్వాధీనం చేసుకున్నారు.

జాతీయం

బీసీసీఐకి రైనా, జడేజా క్షమాపణలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముక్కోణపు సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతిగా ప్రవర్తించిన రవీంద్ర జడేజా, సురేష్‌ రైనాలు బీసీసీఐని క్షమాపణలు కోరారు. జడేజా-రైనాల మధ్య వాగ్వాదం జరిగిన ఘటనపై బీసీసీఐ జట్టు యాజమాన్యం నుంచి విరమణ తీసుకుంది. బీసీసీఐ…

వార్తలు

బుద్ధగయ పేలుళ్ల సంఘటనలో ఆరుగురు అనుమానితులు

గయ: బుద్ధగయలో జరిగిన బాంబు పేలుళ్లలో ఆరుగురిని అనుమానిస్తున్నట్లు బీహార్‌ పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరా పుటేజీల అధారంగా ఒక మహిళ సహా అరుగురు వ్యక్తులను అనుమానితులుగా భావిస్తున్నట్లు చెప్పారు. అరుగురిలో ముగ్గురు వ్యక్తులు అనధికారిక ప్రాంతాల ద్వారా…

తెలంగాణ

ఫీజుల వ్యవహారంపై మద్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఇంజనీరింగ్‌ ఫీజుల వ్యవహారంపై హైకోర్టు మంగళవారం మద్యంతర ఉత్తర్వులు విధించింది. ఫీజలపై తుది విచారణ వచ్చే వరకూ ఎఫ్‌ఆర్సీ విధానీన్నే కొనసాగించాలని అభిప్రాయపడింది. అదనపు రుపుము కోసం విద్యార్థుల నుంచి అంగీకార పత్రాన్ని తీసుకోవాలని హైకోర్టు తెలిపింది.

జాతీయం

వారం రోజుల్లో అంజలిని కోర్టులో హాజరు పరచండి

చెన్నై,(జనంసాక్షి): వారం రోజుల్లో సినీనటి అంజలి కోర్టులో హాజరుపరచాలని చెన్నై కోర్టు హెచ్చరించింది. గతంలో అంజలి కిడ్నాప్‌ ఉదంతానికి సంబంధించి విచారణ కొనసాగిస్తున్న కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం విచారణ సందర్భంగా అంజలిని కోర్టులో…

తెలంగాణ

తపాలశాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి

హైదరాబాద్‌: తపాలశాఖలో పనిచేస్తున్న గ్రూప్‌-డి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం హైదరాబాద్‌లో ఆందోళనకు దిగింది. ఒక్క రోజు విధుల బహిష్కరించిన ఉద్యోగులు అబిడ్స్‌లోని డాక్‌ సదస్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. తపాలాశాఖలో గ్రూప్‌-డి…

తెలంగాణ

ఏసీబీ వలలో చిక్కిన వీఆర్వో

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): ఓ అవినీతి వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కిందుర్గు మండలం తంగెళ్లపెల్లి వీఆర్వో రాజేందర్‌ ఓ వ్యక్తి నుంచి రూ. 3వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయం

మధ్యప్రదేశ్‌ మాజీ మంత్రి రాఘవ్‌జీ అరెస్ట్‌

భోపాల్‌(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌ మాజీ మంత్రి రాఘవ్‌జీని పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన గత రెండు రోజుల నుంచి అజ్జాతంలో ఉన్నారు. భోపాల్‌లోని కో ఇ ఫిజా ప్రాంతంలో ఒక ప్లాట్‌లో తలదాచుకుంటున్న ఆయన్ని…