Wednesday, 4 November 2026

July 2013

అంతర్జాతీయం

అధ్యక్ష ఎన్నికలను బహిష్కరించనున్న గత అధికార పార్టీ

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ గత అధికార పార్టీ తాజా అధ్యక్ష ఎన్నికలను బహిష్కరించనుంది. ప్రచారానికి ఎన్నికల సంఘం తగినంత సమయం ఇవ్వలేదని ఈ నిర్ణయం తీసుకొంది. పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) కి చెందిన రజారబ్బాని శుక్రవారం ఈ…

తెలంగాణ

తెలంగాణ ఆగదు: ఎంపీ గుత్తా

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్ర నేతలు రాజీనామాలతో బెదిరిస్తే తెలంగాణ ఆడదు అని ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఒక వేళ వారు రాజీనామాలు చేస్తే రాష్ట్రపతి పాలన వస్తుందన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన చెప్పారు.

వార్తలు

నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్‌

హరారే: భారత్‌-జింబాబ్వే మధ్య జరుగుతున్న రెండో వన్డేలో భారత్‌ కష్టాల్లో కూరుకుపోయింది. 17.3 ఓవర్లకు భారత్‌ 66 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్‌శర్మ (1), విరాట్‌ కోహ్లి (14), సురేశ్‌రైనా(4), తిరుపతిరాయుడు (5) పరుగులకే పెవిలియన్‌…

తెలంగాణ

రాష్ట్రానికి 23 కంపెనీల కేంద్ర బలగాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రానికి 23 కంపెనీల కేంద్ర బలగాలు రానున్నాయి. ఈ బలగాలన్నీ సీమాంధ్ర ప్రాంతాలకు తరలి వెళ్లనున్నాయి. రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకునే వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా బలగాలను మోహరిస్తున్నట్లు సమాచారం.…

జాతీయం

పాండేను ఈ నెల 29 వరకు అరెస్టు చేయవద్దు :ఆదేశించిన సుప్రీం కోర్టు

ఢిల్లీ: ఇష్రాత్‌ జహాన్‌ కేసులో పీపీ పాండేను ఈ నెల 29 వరకు అరెస్టు చేయవద్దని సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. తనపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలన్న ఐపీఎస్‌ అధికారి పీపీ పాండే అభ్యర్థనపై ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.…

జాతీయం

తెలంగాణ ఇస్తున్నట్లు బొత్సకు సంకేతాలిచ్చిన సీఎం కిరణ్‌

న్యూడిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వైపే కాంగ్రెస్‌ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో విభజన తప్పదని కాంగ్రెస్‌ అధినాయకత్వం సీఎం, పీసీసీ చీఫ్‌కు సంకేతాలిచ్చినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లో వరుస భేటీలు జరిపిన దిగ్విజయ్‌ సింగ్‌, ఆజాద్‌…

జాతీయం

విద్యుత్తు ప్రమాదం వల్ల 10 మంది వృద్ధుల మృతి

బీజింగ్‌: హైలాంగ్‌ జియాంగ్‌ వృద్ధాలు కోసం ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో శుక్రవారం విద్యుత్తు ప్రమాదం జరిగింది. హైలూన్‌ నగరంలోని లియాన్‌ హేసీనియర్‌ నర్సింగ్‌ హోంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలో ఉన్న 10 మంది వృద్ధులు…

జాతీయం

రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లో జరగదు: మంత్రి శైలజానాథ్‌

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై వస్తున్నవన్నీ వూహాగానాలేనని మంత్రి శైలజానాథ్‌ అన్నారు. ఆయన ఢిల్లీలో విలేకర్లను కలిశారు. ఢిల్లీలో ముఖ్యనేతలందరినీ కలిశామన్నారు. రాష్ట్రవిభజన ఎట్టి పరిస్థితుల్లో జరగదన్నారు.

జాతీయం

ఏపీ భవన్‌లో ముగిసిన భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): దేశ రాజధానిలోని ఏపీ భవన్‌లో సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల సమావేశం ముగిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర నేతలు మరోసారి తీర్మానం చేశారు. కేంద్రమంత్రులు, ఎంపీలకు ఇదే విషయాన్ని తెలియజేశామని, రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు…

తెలంగాణ

కారులో అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును పట్టుకున్న పోలీసులు

వరంగల్‌: వరంగల్‌ జిల్లా మామునూరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 6లక్షలను స్వాధీనం చేసుకున్నారు.