Wednesday, 4 November 2026

July 2013

జాతీయం

ప్రధానితో దిగ్విజయ్‌సింగ్‌ సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ సమావేశమయ్యారు. సమావేశంలో తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం. సీఎం, డిప్యూటీ సీఎం, బొత్సలతో చర్చించిన సారాంశాన్ని ప్రధానికి ఆయన నివేధించినట్లు తెలుస్తుంది.

జాతీయం

కాంగ్రెస్‌ అధినేత్రితో సీఎం కిరణ్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇవాళ ఆయన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో చర్చించారు. అనంతరం ఆయన సోనియా అపాయింట్‌మెంట్‌ దొరకడంతో సోనియాను కలిశారు.

జాతీయం

ఆర్థిక మంత్రితో దువ్వూరి భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో రిజర్వ్‌బ్యాంకు గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు భేటీ అయ్యారు. ఈ నెల 30న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరుపనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

అంతర్జాతీయం

అంపైర్‌ నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి

హరారే: జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డే మాచ్‌లో తన అవుట్‌పై భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండో వన్డే ఏడో ఓవర్లో జార్విన్‌ విసిరిన బంతిని కోహ్లి మిడ్‌ వికెట్‌వైపు కొట్టగా ఫీల్డర్‌ వాలర్‌…

అంతర్జాతీయం

జింబాబ్వే విజయలక్ష్యం 295

హరారే: జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో టాన్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లకి 8 వికెట్లు నష్టపోయి 294 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ 116, దినేశ్‌ కార్తీక్‌ 69 పరుగులు చేశారు.

సీమాంధ్ర

గంట గంటకు పెరుగుతున్న వరద ఉద్ధృతి

శ్రీశైలం: కృష్ణ ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో జలాశయంలో నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. గరిష్ఠ స్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215…

తెలంగాణ

ప్రారంభంకానున్న మహంకాళి బోనాల ఉత్సవాలు

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల ఉత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు చేయాలని ఉత్సవ కమిటీ నాయకుడు, తెదేపా నేత తలసాని శ్రీనివాస యాదవ్‌ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మను కలిశారు. బోనాల సందర్భంగా వూరేగింపులు ఉండటంతో ఎటువంటి…

జాతీయం

త్రిమూర్తులతో ముగిసిన వార్‌రూమ్‌ భేటీలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లో త్రిమూర్తులతో దిగ్విజయ్‌సింగ్‌, ఆజాద్‌ వరుస భేటీలు ముగిశాయి. సీఎం,డిప్యూటీ సీఎం, బొత్సలతో వేర్వేరుగా చర్చలు జరిపారు. ఈ ముగ్గురితో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, తెలంగాణ అంశంపై సుధీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది. సీఎంతో …

అంతర్జాతీయం

మయన్మార్‌ క్యాబినెట్‌లో మార్పులు

యాంగాన్‌: మయన్మార్‌ క్యాబినెట్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు ఆ దేశ అధ్యక్ష కార్యాలయ వర్గాలు గురువారం వివరాలను వెల్లడించాయి. ప్రస్తుత క్యాబినెట్‌ నుంచి నలుగురు మంత్రులు రాజీనామాలు చేయగా, మరో ఇద్దరు ఉప మంత్రులు క్యాబినెట్‌ నుంచి…