Wednesday, 4 November 2026

July 2013

జాతీయం

వార్‌రూమ్‌లో దిగ్విజయ్‌తో దామోదర భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): వార్‌రూమ్‌లో రాష్ట్రానికి చెందిన త్రిమూర్తులతో దిగ్విజయ్‌సింగ్‌, ఆజాద్‌ వరుస భేటీలు జరుపుతున్నారు. సీఎం, బొత్సతో భేటీ ముగిసిన అనంతరం డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో వారు చర్చిస్తున్నారు. సీఎంతో 45 నిమిషాలు, బొత్సతో 30 నిమిషాలు చర్చించారు.

సీమాంధ్ర

రైలు ఇంజన్‌ మోరాయించడంతో నిలిచిన ట్రాఫిక్‌

పాలకొల్లు పట్టణం: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు భీమవరం జాతీయ రహదారి 216 సమీపంలో రైలు ఇంజన్‌ మొరాయించడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. దీని కోసం భీమవరం, విజయవాడ నుంచి అధికారులు రానున్నారు.

జాతీయం

త్వరలో సీడబ్ల్యూసీ సమావేశం :పీసీసీ చీఫ్‌ బొత్స

న్యూఢిల్లీ,(జనంసాక్షి): త్వరలోనే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లో దిగ్విజయ్‌సింగ్‌, ఆజాద్‌తో భేటీ ముగిసిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయం చెప్పేందుకే సమావేశాలు…

తెలంగాణ

అహ్మదాబాద్‌లో భవనం కూలడంతో ఇద్దరికి గాయాలు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మూడంతస్థుల భవనం శుక్రవారం కుప్పకూలింది. నగరంలోని రానిప్‌ ప్రాంతంలో రూపాల్‌ అపార్టుమెంటు శుక్రవారం ఉదయం సుమారు 11గంటల ప్రాంతంలో కుప్పకూలినట్టు అగ్రిమాపక సిబ్బంది ఒరు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా వారిని సమీపంలోని…

సీమాంధ్ర

ఏసీబీ వలలో చిక్కిన సర్వేయర్‌

విశాఖ,(జనంసాక్షి): మునగపాక సర్వేయర్‌ సూర్యనారాయణ ఏసీబీ అధికారులకు చిక్కారు. రైతు నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సూర్యనారాయణను పట్టుకున్నారు.

జాతీయం

అరెస్టుయిన జగన్‌ను కలిసిన పేర్ని నాని, శ్రీకాంత్‌

చంచల్‌గూడ: అక్రమ ఆస్తుల కేసులో అరెస్టుయిన జగన్‌మోహన్‌రెడ్డిని మచిలీ పట్నానికి చెందిన పేర్ని నాని, రాయచోటికి చెందిన శ్రీకాంత్‌రెడ్డిలు శుక్రవారం జైలులో కలిశారు. ఇటీవల తెలంగాణ విషయంలో వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్టు వస్తున్న సమాచారంతో ఈ భేటీ…

జాతీయం

సాయంత్రం 5 గంటలకు కోర్‌ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ,(జంనసాక్షి): ఈ సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ సమావేశం తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని గతంలో దిగ్విజయ్‌సింగ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.

జాతీయం

వార్‌ రూమ్‌లో కొనసాగుతున్న వరుస భేటీలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లో రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ అంశంపై చర్చలు జరుగుతున్నారు. ఈ అంశాలపై చర్చించేందుకు రాష్ట్రానికి చెందిన త్రిమూర్తులతో దిగ్విజయ్‌సింగ్‌, గులాం నబీ ఆజాద్‌ వరుస భేటీలు జరుపుతున్నారు. సీఎంతో భేటీ ముగిసిన అనంతరం పీసీసీ చీఫ్‌…