Friday, 6 November 2026

July 2013

వార్తలు

గర్భిణులకు ఉచిత వైద్య సహాయం అందిస్తారన్న ఆజాద్‌

జైపూర్‌: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా గర్భిణులకు ఉచిత వైద్య సదుపాయం, సమయానికి ఆస్పత్రికి చేరుకోవడానికి అంబులెన్సు సౌలభ్యం కల్పించనుందని కేంద్ర ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్‌ ప్రకటించారు. జననీ సురక్ష పథకం కింద గర్భిణులకు, బాలింతలకు ఉచిత…

తెలంగాణ

సీబీఐ ముందు హాజరైన బ్యాంకుల అధికారులు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో జాతీయ బ్యాంకుల అధికారులు ఈరోజు సీబీఐ ముందు హాజరయ్యారు. ప్రైవేట్‌ విద్యుత్‌ ప్రాజెక్టు ప్రతినిధి రాఘరావు కూడా సీబీఐ ముందు హాజరయ్యారు.

జాతీయం

రాష్ట్రంలో 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం

విశాఖపట్నం: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని పేర్కొంది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర…

జాతీయం

బుద్ధగయ పేలుళ్ల కేసులో అనుమానితుడి చిత్రం విడుదల

ఢిల్లీ: బుద్ధగయలోని మహాబోధి అలయంలో పది రోజుల క్రితం జరిగిన వరుసు పేలుళ్ల కేసులో అనుమానితుల ఛాయాచిత్రాలను జాతీయ దర్యాప్తు సంస్థ ఈరోజు విడుదల చేసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ఆధారంగా ఒక వ్యక్తి చిత్రం విడుదల చేశామని,…

జాతీయం

ఆగంతుకుల కాల్పులకు గురైన కేంద్ర మంత్రి

కోల్‌కతా: కేంద్ర మంత్రి అబూ హసెం ఖాన్‌ చౌధురిపై ఆగంతుకులు కాల్పులు జరిపారు. అయితే ఆయనకు ఎలాంటి హానీ జరగలేదని సురక్షితంగా ఉన్నారని సమాచారం. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక ర్యాలీలో పాల్గొన్నప్పుడు…

సీమాంధ్ర

వాతావరణ అనుకులించకపోవటంతో విమాన సర్వీసులకు ఆటంకం

కోరుకొండ, తూర్పుగోదావరి: రాజమండ్రి -హైదరాబాద్‌ విమాన సర్వీసులకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఆటంకం కల్గించాయి. రాజమండ్రి -హైదరాబాద్‌ స్పైన్‌జెట్‌ విమానం రాజమండ్రి నుంచి సుమారు రెండు గంటల పాటు ఆలస్యంగా బయల్దేరింది. అలాగే జెట్‌ ఎయిర్‌వేస్‌ విమాన సర్వీసును…

తెలంగాణ

ఎన్నికలను బహిష్కరిస్తామంటు ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామస్థులు

కరీంనగర్‌ జిల్లా: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల మండలం బాబాజీనగర్‌లో గ్రామస్థులు ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించారు. 15 ఏళ్లుగా తిరిగినా కులధ్రువీకరణ పత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వారీ తీర్మానం చేశారు. కులధ్రువీకరణ పత్రం అందజేస్తేనే పంచాయతీ…

సీమాంధ్ర

కారులో తరలిస్తున్న రూ. 6లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం బొర్రావారిపాలెంలోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఒక కారులో తరలిస్తున్న రూ. 6లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సీమాంధ్ర

మంచి నిర్ణయం తీసుకోవాలన్న తెదేపా నేత సోమిరెడ్డి

నెల్లూరు: రాష్ట్రం విడిపోతే మరో జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలుగా మారుతుందని తెదేపా నేత సోమిరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలతో పునఃసమీక్షించుకుని, తెలుగువారికి ప్రయోజనం కలిగే మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు.