Friday, 6 November 2026

July 2013

వార్తలు

విద్యుత్‌ సంస్థల ఆదాయ, వ్యయాలపై ఆడిట్‌

హైదరాబాద్‌: విద్యుత్‌ సంస్థల ఆదాయ, వ్యయాలపై ఆడిట్‌ చేయడానికి విద్యుత్‌ నియంత్రణ మండలి ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ సందర్భంగా సింగరేణి భవన్‌లో విద్యుత్‌ నియంత్రణ మండలి అభిప్రాయ సేకరణ జరుపుతోంది. డిస్కంల అధికారుల హాజరయ్యారు.

వార్తలు

ఆర్థిక వ్యవస్థ మెరుగుపర్చేందుకు చర్యలు: చిదంబరం

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగు పరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. బంగారం దిగుమతులను నిషేధించడం సాధ్యం కాదు అని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6 కంటే…

ఆదిలాబాద్

భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగిటం వల్ల నిలిచిన రాకపోకలు

జైనూరు: ఆదిలాబాద్‌ జిల్లా జైనూరు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షానికి మండలంలోని పానాపటార్‌, లెండిగూడ, కిషన్‌నాయక్‌ తండ గ్రామ పొలిమేరల్లో ఉన్న వాగులు…

వార్తలు

ప్యాకేజీ తెలంగాణకు వరం : జగ్గారెడ్డి

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రతి పాదించిన ప్యాకేజీ తెలంగాణకు వరమని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణ వెనుక బడిందని ఉద్యమం చేస్తున్న వాళ్లు ప్యాకేజీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఏర్పడితే ప్రజల…

జాతీయం

బంగారం దిగుమతులను నిషేధించడం సాధ్యం కాదు:మంత్రి చిదంబరం

ఢిల్లీ : బంగారం దిగుమతులను నిషేధించడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ…. విదేశాలతో మనం జరిపే లావాదేవీలపైనే రూపాయి విలువ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో…

వార్తలు

నైట్‌ బార్లలో నృత్యాలకు సుప్రీం అనుమతి

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని నైట్‌బార్లలో నృత్యాలపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తాజా తీర్పునిచ్చింది. నైట్‌బార్లలో మహిళల నృత్యాలను నిషేధిస్తూ మహరాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం తోసిపుచ్చింది. నైట్‌బార్లలో మహిళల నృత్యాలను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందికాదని గతంలో…

జాతీయం

ప్రారంభమైన వంశధారపై ట్రైబ్యునల్‌లో వాదనలు

ఢిల్లీ: వంశధారపై ట్రైబ్యునల్‌లో వాదనలు ప్రారంభమయ్యాయి. 1962 ఒప్పందం ప్రకారం నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా కావాలనే అడ్డంకులు కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాది తన వాదనలు వినిపించారు. 106 ఎకరాల భూమిని ఒడిశా అప్పగించకుండా బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకుంటుందని…

వార్తలు

మందుగుండు పేలి రైతులకు గాయాలు

మహబూబ్‌నగర్‌: మందుగుండు పేలి ఇద్దరు రైతులకు గాయాలయ్యాయి, ఈ ఘటన జడ్చర్ల మండలం కావేరమ్మపేట శివారులోని పొలాల్లో చోటు చేసుకుంది. గాయాలపాలైన రైతులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

తెలంగాణ

యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు

వరంగల్‌: భారీ వర్షంలోనూ యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. వరంగల్‌ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ ప్రాథమిక సహకార పరపతి సంఘం కార్యాలయం ఎదుట రైతులు యూరియా కోసం బారులు తీరారు.

జాతీయం

మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకున్న సుప్రీంకోర్టు

ఢిల్లీ: బార్లలో నృత్యాలను నిషేధిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. బార్లలో మహిళా నృత్యాలను నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని బాంబే హైకోర్టు సమర్థించింది. దీంతో తాము ఉపాధికోల్పోతున్నామని మహిళా డ్యాన్సర్లు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు…