Thursday, 5 November 2026

July 2013

తెలంగాణ

హరీష్‌రావు దంపతులకు తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు దంపతులు శుక్రవారం తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌ చౌరస్తా వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరీష్‌ రావు దంపతులు స్వల్పంగా గాయపడ్డారు.

తెలంగాణ

ప్రారంభమైన జ్యూయల్స్‌ ఏషియా-2013

హైదరాబాద్‌: అభరణాల ప్రియుల కోసం భాగ్యనగరంలో శుక్రవారం ఓ ప్రదర్శన ఏర్పాటైంది. జ్యూయల్స్‌ ఏషియా-2013 పేరిట బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో ఈ రోజు ఖరీదైన అభరణాల ప్రదర్శన ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో తక్కువ…

జాతీయం

నివాసానికి చేరుకున్న ఆజాద్‌, కిరణ్‌, బొత్స

ఢిల్లీ: కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ కాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఆజాద్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి , పీసీసీ అధినేత బొత్స సత్య నారాయణ ప్రధాని నివాసానికి చేరుకున్నారు.

జాతీయం

ప్రారంభమైన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం ప్రారంభం అయింది. కోర్‌ కమిటీ సాయంత్రం 5.30 గంటలకు భేటీ కావల్సి ఉన్న ముందుగానే సమావేశమైంది. ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ నివాసంలో భేటీ జరుగుతుంది. సోనియాతో…

తెలంగాణ

వాగులో పడి ఇద్దరు మృతి

కాటారం: కాటారం-మహాముత్తారం ప్రధాన రహదారిలోని దౌత్‌పల్లి వాగులో పడి గురువారం రాత్రి ఇద్దరు యువకులు మృతి చెందారు. గురువారం రాత్రి మహాముత్తారం గ్రామానికి చెందిన బోడ భాస్కర్‌(25), తన సమీప బంధువైన శ్రీనివాస్‌ను తీసుకుని కాటారం నుంచి ద్విచక్రవాహనంపై…

జాతీయం

రాజీనామా వార్తలను ఖండించిన సీఎం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తన రాజీనామాపై వచ్చిన వార్తలను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఖండించారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా సోనియాగాంధీ ఆదేశాలను ఎన్నడూ దిక్కరించనని, సోనియా నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసముందని ఆయన ఓ ప్రయటనలో వెల్లడించారు. మీడియా అనవసర ఊహాగానాలను ఎందుకు…

తెలంగాణ

వాగు పొంగి రహదారిపైకి చేరాడంతో నిలిచిన రాకపోకలు

ఖమ్మం :భారీ వర్షానికి ఖమ్మం జిల్లాలో వాగులు పొంగుతున్నాయి. భద్రాచలం డివిజన్‌లోని సోకులేరు వాగు పొంగి రహదారిపైకి వరదనీరు చేరింది. దీంతో చింతూరు, వీఆర్‌పురం మండలాలకు రాకపోకలు నిలిచి పోయాయి.

తెలంగాణ

ఓయూలో విద్యార్థుల బైక్‌ ర్యాలీ

హైదరాబాద్‌: కోర్‌కమిటీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆర్ట్స్‌ కళాశాల నుంచి ఎస్‌.సి.సి గేటు వరకూ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తామని, లేదంటే కాంగ్రెస్‌…