Wednesday, 4 November 2026

August 2013

జాతీయం

భారత జవాన్లకు నివాళులర్పించిన లోక్‌సభ

న్యూఢిల్లీ: వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్‌సభలో పాక్‌ సైన్యం చేతిలో ఆసువులు బాసిన భారత జవాన్లకు లోక్‌సభ నివాళులర్పించింది. జమ్మూకాశ్మీర్‌లోకి పూంచ్‌ వద్ద పాకిస్థాన్‌ సైన్యం జరిపిన కాల్పులు అయిదుగురు భారత జవాన్లు మృతి చెందిన విషయం విదితమే.

జాతీయం

ప్రారంభమైన ఐదు నిమిషాలకే వాయిదా లోక్‌సభ

న్యూఢిల్లీ : లోక్‌సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే వాయిదా పడింది. తెలంగాణను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంత ఎంపీలు నినాదాలు చేయడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌…

జాతీయం

జనాన్ల మృతికి నివాళులర్పించిన: సీఎం నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: పాక్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో మృతి చెందిన భారత జవాన్లకు గుజరాత్‌ సీఎం నరేంద్ర మోడీ నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. కేంద్రం ఎప్పుడు…

జాతీయం

కాశ్మీర్‌లో జరిగిన కాల్పులపై రాజ్యసభలో డిమాండ్‌ చేస్తున్న బీజేపీ

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ వద్ద ఈ ఉదయం పాక్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనపై చర్చ చేపట్టాలని రాజ్యసభలో విపక్షాలు పట్టుబట్టాయి. పాక్‌ కాల్పుల ఘటనపై ప్రధాని…

సీమాంధ్ర

15రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్న ఏడు లంకగ్రామాలు

అంబాజీపేట: తూర్పుగోదావరి జిల్లా అయినవెల్లి మండలంలోని ఏడు లంక గ్రామాల ప్రజలు గత 15రోజులుగా వరద నీటిలో చిక్కుకుని ఉన్నారు. మండలంలోని అయిన వెల్లి లంక, వీరపల్లిపాలెం, కె పెద్దలంక, కొండుకుదురు లంక, చింతల లంక, మడిపెల్ల లంక,…

తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక ఓ మహిళ మృతి

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఓ మహిళ సరైన వైద్యం అందక మృతి చెందింది. కూనవరం మండలంలోని టేకులబోరు గ్రామానికి వేదవతి (45) విరేచనాలతో బాధపడుతూ సోమవారం రాత్రి కూనవరం ప్రభుత్వం ఆసుపత్రిలో చేరింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో…

తెలంగాణ

జయశంకర్‌ సార్‌కు నివాళులర్పించిన తెలంగాణ జేఏసీ టీ ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్‌: తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పది జిల్లాలో జయశంకర్‌ సార్‌ విగ్రహాలకు, ఫోటోలకు పూలమాలలు వేసి పలువురు ప్రముఖులు, తెలంగాణవాదులు నివాళులర్పిస్తున్నారు. తెలంగాణ…

జాతీయం

పాక్‌ సైన్యం దాడిలో భారత జవాన్లు మృతి

జమ్మూకాశ్మీర్‌: జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లోని చకందాబాద్‌ వద్ద భారత బలగాలపై పాక్‌ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు మృతి చెందినట్లు సమాచారం.

సీమాంధ్ర

24 గంటల్లో పలుచోట్ల కురునున్న వర్షం

విశాఖ: రాగాల 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణలో పలుచోట్ల , రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు…