Thursday, 5 November 2026

August 2013

జాతీయం

లోక్‌సభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. వాస్తవాధీన రేఖ వద్ద భారత సైన్యం అన్‌ప్రోవోక్‌డ్‌ ఎగ్రెషన్‌’కి పాల్పడిదంటూ పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం పార్లమెంట్‌లో ఏకగ్రీవ తీర్మానం చేసింది.

తెలంగాణ

ఏసీబీ వలలో చిక్కిన ఈవో

రంగారెడ్డి,(జనంసాక్షి): లంచం తీసుకుంటూ బాచుపల్లి పంచాయతీ ఈవో వజ్రలింగం ఏసీబీ అధికారులకు చిక్కారు. రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా వజ్రలింగంను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

జాతీయం

మూడు రాష్ట్రాలకు ఐబీ హెచ్చరికలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌లకు ఇంటెలిజెన్స్‌ బ్యూరో( ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. ఏ క్షణమైనా మావోయిస్టులు దాడి జరిపే అవకాశం ఉందని ఆ మూడు రాష్ట్రాలను ఐబీ  హెచ్చరించింది.

జాతీయం

3 గంటల వరకు వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో ఆహార భద్రతా బిల్లుపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది.

జాతీయం

లోక్‌సభ 2 గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సమైక్యాంధ్రను కోరుతూ సీమాంధ్ర ఎంపీలు స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లారు. రాష్ట్రాన్ని విభజించొద్దని ఎంపీలు నినాదాలు చేశారు. ఎంపీలు తీరుపై స్పీకర్‌ మీరా కుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

జాతీయం

పెరిగిన ద్రవ్యోల్భణం

ముంబయి,(జనంసాక్షి): జూలై మాసంలో ద్రవ్యోల్భణం స్వల్పంగా పెరిగింది. ద్రవ్యోల్భణం 4.86 శాతం నుంచి 5.79 శాతానికి పెరిగినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.

తెలంగాణ

హైదరాబాద్‌ మార్కెట్లో పసిడి ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,400లు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 28,800 లుగా ఉంది. కిలో వెండి ధర …

జాతీయం

రాష్ట్ర విభజన సున్నితమైన అంశం: దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ విభజనపై ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అని ఇరు ప్రాంతాల నేతలను హెచ్చరించామని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. రాష్ట్ర విభజన అంశం సున్నితమైన అంశం అని అనవసర రాద్దాంతం చేయొద్దు అని…

జాతీయం

ప్రధానిని కలిసిన ఏకే ఆంటోని

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముంబయి నావికాదళం రేవులో జలాంతర్గామిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై రక్షణ మంత్రి ఏకే ఆంటోని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసి వివరించారు. ముంబయి నివాకాదళం రేవును ఆంటోని గురువారం సందర్శించనున్నారు. జలాంతర్గామి పేలుడులో విశాఖ జిల్లా పెదగంట్యాడుకు చెందిన…

తెలంగాణ

18న తెలంగాణ మంత్రుల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ నెల 18న మరోసారి తెలంగాణ మంత్రులు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. సమావేశంలో ఆంటోని కమిటీకి ఇచ్చే నివేదికపై చర్చించనున్నారు. ఢిల్లీకి వెళ్లే తేదీని కూడా మంత్రులు ఖరారు చేయనున్నారు.