Thursday, 5 November 2026

August 2013

జాతీయం

ప్రారంభమైన పార్లమెంట్‌ ఉభయ సభలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌: ఉభయ సభులు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే సీమాంధ్ర టీడీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటూ టీడీపీ ఎంపీలు ఆందోళనకు…

జాతీయం

లాలూ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): దాణా కుంభకోణం కేసు విచారణను వేరే కోర్టుకు మార్చాలన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో వీలైనంత త్వరగా తీర్పు వెలువరించాలని ట్రయల్‌ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ

కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎస్‌ఆర్‌ నగర్‌లోని కమర్షియల్‌ ట్యాక్స్‌ డిప్యూటీ కమిషనర్‌ ఎం శ్రీనివాసులు నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా రూ. 50 లక్షల నగదు, భారీగా నగలు స్వాధీనం చేసుకున్నారు. దాడులు కొనసాగుతున్నాయి.

తెలంగాణ

19 నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఇంజినీరింగ్‌ కోర్సులో సీట్ల భర్తీ కోసం షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు ఇవాళ ఏపీ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆగస్టు 19 నుంచి 30 వరకు సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని ఏపీఎస్‌సీహెచ్‌ఈ చైర్మన్‌ ప్రొఫెసర్‌…

తెలంగాణ

బెదిరింపు లేఖపై అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేసిన టీఆర్‌ఎస్‌ నేతలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): పది రోజుల్లో కాల్చి చంపుతామని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు వచ్చిన బెదిరింపు లేఖను  నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మకు టీఆర్‌ఎస్‌ నేతలు అందించారు. ఎల్‌ఈటీ ఆంధ్రా నక్సల్స్‌ పేరుతో గత రాత్రి తెలంగాణ భవన్‌కు లేఖ…

జాతీయం

లగడపాటి సీడబ్ల్యూసీ సభ్యుడు కాదు : దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి హోంమంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తుందని తెలిపారు. విస్తృత సంప్రదింపుల తర్వాతే తెలంగాణపై…

జాతీయం

ఢిల్లీలో సీమాంధ్ర కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధుల భేటీ

న్యూఢిల్లీ:  ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు కాంగ్రెస్‌ ఎంపీలు, ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యచరణ పై నేతలు చర్చిస్తున్నారు.

అంతర్జాతీయం

కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంగించిన పాక్‌

శ్రీనగర్‌ : నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది. జమ్ము కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ బలగాలు కాల్పులకు పాల్పడ్డాయి. అయితే భారత సైనికులు ఈ దుశ్చర్చను…

Cartoons

seemandra – cartoon

మనం సమ్మెలో పాల్గొంటే ఎన్ని ఉద్యోగాలు కొట్టేశామో వాళ్లకి తెలిసిపోయిద్ది గా?

Featured News

హైదరాబాద్‌పై రాజీలేదు సీమాంధ్రుల రక్షణకు ఢోకా లేదు : కోదండరామ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 12 (జనంసాక్షి) : హైదరాబాద్‌ తెలంగాణ ప్రజల సొంతమని, దీనిపై ఎలాంటి రాజీలేదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పేర్కొన్నారు. నగరంలోని విద్యుత ్‌సౌధా వద్ద సీఎం వ్యాఖ్యలకు నిరసనగా నిర్వహించిన ఆందోళనలో ఆయన…