Wednesday, 4 November 2026

August 2013

జాతీయం

రాజ్యసభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ ఐదు నియిషాలకే వాయిదా పడింది. సీమాంధ్ర టీడీపీ ఎంపీలు రాజ్యసభలో ఆందోళనకు దిగారు. మూడో రోజూ సభలో కార్యకలాపాలను స్తంభింపచేశారు. సమైక్యాంధ్ర నినాదాలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో సభను…

తెలంగాణ

హైదరాబాద్‌ను అల్లకల్లోలం చేసేందుకు కుట్రలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణను అడ్డుకోవడంతో హైదరాబాద్‌లో విధ్వంసాలకు పాల్పడేందుకు సీమాంధ్ర మంత్రులు తెర లేపినట్లు సమాచారం. హైదరాబాద్‌ను అల్లకల్లోలం చేసేందుకు ఇద్దరు సీమాంధ్ర మంత్రులు ఏపీఎన్టీవోలతో కుట్రలు రచించినట్లు తెలుస్తుంది. తెలంగాణ ఉద్యోగులపై దాడులు చేయాలని ఆంధ్రా ఉద్యోగులపై దిశానిర్ధేశం…

ఆదిలాబాద్

వర్షం కారణం వల్ల కుప్పకూలిన పాఠశాల భవనం

బేల: మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల భవనం మంగళవారం అర్థరాత్రి వర్షం కారణంగా కుప్పకూలింది. రాత్రిపూట కావడంతో ఎలాంటి హానీ జరగలేదు. భవనం కూలిపోవడంతో విద్యార్థులకు ఉపాధ్యాయులు బుధవారం ఆరుబయటే తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాల సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం…

తెలంగాణ

రూ.24 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ , డీఎస్పీకి చిక్కిన వీఆర్వో

హైదరాబాద్‌: రూ. 24వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు నిజామాబాద్‌ జిల్లా రేంజల్‌ మండలం సత్తాపూర్‌ వీఆర్‌వో రాజేశ్వర్‌ పాసు పుస్తకం కోసం వీఆర్‌వో రాజేశ్వర్‌ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ ,…

తెలంగాణ

కేసీఆర్‌ న్యాయకత్వంలోనే పనిచేస్తా: చందూలాల్‌

వరంగల్‌,(జనంసాక్షి): తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నానని వస్తున్న వార్తలు అవాస్తవమని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు చందూలాల్‌ స్పష్టం చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలోనే పని చేస్తానని ఆయన తేల్చిచెప్పారు. ఓ పనిపైనే ఢిల్లీ వెళ్లాను తప్ప కాంగ్రెస్‌ నేతలను కలవలేదని …

తెలంగాణ

12 వ తేదీ అర్ధరాత్రి నుంచి టీఎంయూ సమ్మె

హైదరాబాద్‌,(జనంసాక్షి): పార్లమెంట్‌ తెలంగాణ బిల్లు పెట్టి కాంగ్రెస్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌కు తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌(టీఎంయూ) సమ్మె నోటీసు ఇచ్చింది. ఆగస్టు 12 వ తేదీ అర్ధ్రరాత్రి నుంచి…

తెలంగాణ

ఆర్టీసీ బస్సు, ఆటోఢీ: ఒకరి మృతి

హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మాచినేనిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

జాతీయం

మధ్యాహ్నం 3గంటలకు వాయిదా పడిన లోక్‌సభ

ఢిల్లీ: రెండు గంటలకు సమావేశమైన లోక్‌సభలో మరోసారి సీమాంధ్ర ప్రాంత సభ్యులు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. సరిహద్దులో కాల్పుల ఘటనలు, పశ్చిమబెంగాల్‌ శాంతిభద్రతలు తదితర అంశాలపై సభ్యుల నినాదాలు కొనసాగాయి. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో సభను మూడు…

జాతీయం

జనార్ధన్‌ ద్వివేదితో టీ ఎంపీల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జనార్ధన్‌ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీల భేటీ ముగిసింది. తెలంగాణ నిర్ణయం జరిగిపోయింది. రాష్ట్ర ఏర్పాటుకు కొంత సమయం పడుతుందని ఎంపీలకు ద్వివేది చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే ఆంటోనీ కమిటీకి చెప్పండి…

జాతీయం

హాట్‌లైన్‌లో ఇరుదేశాల సైన్యాధికారుల సంభాషణ

ఢిల్లీ: పూంఛ్‌ సెక్టాల్లో కాల్పుల ఘటనపై భారత్‌, పాకిస్థాన్‌ దేశాల ఉన్నత స్థాయి మిలిటరీ అధికారులు బుధవారం హాట్‌లైన్లో సంభాషించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇరుదేశాల సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితిని తగ్గించడానికి భారత్‌, పాకిస్థాన్‌ దేశాల డైరెక్టర్‌ జనరల్స్‌ ఆఫ్‌…