Tuesday, 3 November 2026

September 2013

కరీంనగర్

స్థానికంగా నివాసముండని ఓటర్ల తొలగింపును రద్దు చేయాలని బీజేపీ ధర్నా

కరీంనగర్‌ : జిల్లాలోని సైదాపూర్‌ మండలంలోని తహసిల్దార్‌ కార్యాలయం ఎదుట గురువారం మండల భాజపా ఆద్వర్యంలో స్ధానికంగా నివాసముండని ఓటర్ల తొలగింపును తక్షణం నిలిపివేయాలని వారు డిమాండ్‌ చేశారు.ఈ మేరకు తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.

హైదరాబాద్

శివారు జీపీల వీలినం జీవో రద్దు చేసిన హైకోర్టు

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ శివారు గ్రామపంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వ జీవోను ఇవాళ హైకోర్టు రద్దుచేసింది. నోటీఫికేషన్‌ జారీ చేసిన పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్

తెలంగాణపై మ్యాచ్‌ ముగిసింది :మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌ : సీడబ్య్లూసీ నిర్ణయంతోనే తెలంగాణపై మ్యాచ్‌ ముగిసిందని మంత్రి శ్రీధర్‌బాబు వరంగల్‌లో అన్నారు. నదీ జలాలు, ఇతర సమస్యలపై చర్చించి పరిష్కారం కనుగొందామన్నారు.ప్రజాస్వామ్య బద్దంగానే తెలంగాణ ఏర్పడుతుందని శ్రీధర్‌బాబు తెలిపారు.

హైదరాబాద్

నాంపల్లికోర్టులో జగన్‌ పిటిషన్‌

హైదరాబాద్‌ :అక్టోబర్‌ 1,2 తేదీల్లో ఇడుపులపాయ, 4న గుంటూరు వెళ్లడానికి అనుమతివ్వాలని నాంపల్లి కోర్టులో వైసీపీ ఆధినేత జగన్‌ పిటీషన్‌ దాఖలు చేశారు.

జాతీయం

జమ్మూలో దాడిగురించి సమాచారం సేకరిస్తున్నాం : హోంమంత్రి షిండే

న్యూఢిల్లీ : జమ్మూకాశ్మిర్‌ రాష్ట్రంలో గురువారం ఉదయం జరిగిన ఉగ్రవాద దాడి గురించి పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌తో పాటు ఆర్మీ క్యాంపుపై కూడా ఉగ్రవాదులు దాడి చేసినట్లు తెలుస్తొందని…

హైదరాబాద్

కస్తూర్బా కళాశాలలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ : కాచిగూడలోని కస్తూర్బా కళాశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

హైదరాబాద్

చర్లపల్లి జైల్లో ఖైదీ ఉరివేసుకుని ఆత్మహత్య

కాప్రా (హైదరాబాద్‌) : చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఈరోజు ఉదయం ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతుతండాలోని లోయపల్లికి చెందిన పర్త్యానాయక్‌ తన బ్యారక్‌లో దుప్పటితో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మృతుడు తన కుమార్తెను హత్యచేసిన…

హైదరాబాద్

రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం షాక్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర పోలీస్‌బాస్‌ డీజీపీ దినేష్‌రెడ్డికి రాష్ట్రప్రభుత్వం నుంచి చుక్కెదురైంది.డీజీపీగా పదవీకాలం పొడగించడం కుదరదని దినేష్‌రెడ్డికి తేల్చిచెప్పినట్లు తెలిసింది.నూతన డీజీపీగా ప్రసాదరావు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

జాతీయం

జమ్మూలో తీవ్రవాదుల దాడులను ఖండించిన బీజేపి

న్యూఢిల్లీ :జమ్మూ కాశ్మీర్‌లో ఈరోజు ఉదయం పాక్‌ ప్రేరేపిత తీవ్రవాదుల జంట దాడులను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్‌ జావదేకర్‌ గురువారం న్యూఢిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ భారత్‌లో తీవ్రవాద…

హైదరాబాద్

వచ్చే నెల 5నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు :టీటీడీ ఈవో గోపాల్‌

హైదరాబాద్‌ : వచ్చే నెల 5నుంచి శ్రీవారి బ్రహోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఎంజీ గోపాల్‌ తెలిపారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు.