Tuesday, 3 November 2026

September 2013

హైదరాబాద్

పాలమూరు ప్రజాగర్జనకు సుష్మాస్వరాజ్‌ : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ : ఈ నెల 28న మహబూబ్‌నగర్‌లో జరిగే పాలమూరు ప్రజాగర్జనకు లోక్‌సభ ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్‌ హాజరవుతారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు.సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు తీవ్రంగా కృషిచేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

జాతీయం

బొగ్గు కేటాయింపులపై సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : బొగ్గుకేటాయింపుల విషయంలో సుప్రీం కోర్టు ఏడు రాష్ట్రాలపై ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇవాళ వాటికి నోటీసులు జారీ చేసింది. అక్టొబర్‌ 29లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ ,మహరాష్ట్ర , ఒడిశా,…

నల్లగొండ

ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్‌ ముగ్గురు వైద్యులకు మెమోలు

భువనగిరి (నల్గొండ) : నల్గొండ జిల్లా భువనగిరిలో 100 పడకల ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్‌ చిరంజీవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిలో పారిశుద్ధ్యం సరిగా లేదని కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం…

మహబూబ్ నగర్

సీఎం కిరణ్‌పై మండిపడ్డ నాగం

మహబూబ్‌నగర్‌ :సమైక్యాంధ్ర కోసం చివరి వరకూ పోరాడతామన్న సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై నాగం జనార్ధన్‌రెడ్డి మండిపడ్డారు.సీఎం పదవిలో ఉండడానికేనా అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణపై ఎటువంటి పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని ఆయన కిరణ్‌పై ఆగ్రహాన్ని…

జాతీయం

ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌కు బాంబు బెదిరింపు

మంగళూరు : కర్ణాటకలోని మంగుళూర్‌లో ఇన్ఫోసిస్‌ ఐటీ క్యాంపస్‌కు బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. క్యాంపస్‌లో బాంబు స్కాడ్‌ బృందాలు తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జాతీయం

చొరబాటు యత్నాన్ని భగ్నం చేసిన సైన్యం

జమ్మూకాశ్మీర్‌ : జమ్మూకాశ్మీర్‌ కేరస్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్ద ప్దె చొరబాటు యత్నాన్ని సైన్యం భగ్నం చేసింది.దాదాపు 30మంది తీవ్రవాదులను భద్రతా దళాల ఉచ్చులో చిక్కినట్లు తెలుస్తొంది. సెప్టెంబర్‌ 24 నుంచి ఈ ఆపరేషన్‌ కొనసాగుతుందని పది,పన్నెండు…

హైదరాబాద్

పిడికెడు మంది పెట్టుబడిదారి ప్రయోజనాల కోసమే సమైక్యం అంటున్నారు : కోదండరాం

హైదరాబాద్‌ : గుప్పెడు మంది పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే సమైక్య ఉద్యమం నడిపిస్తున్నారని టీజేఏసీ చైర్మన్‌ ప్రొ.కొదండరాం అన్నారు. టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నాంపల్లి ప్రియదర్శిని ఆడిటోరియంలో ‘హైదరాబాద్‌ సిర్ప్‌ హమారా సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం…

నిజామాబాద్

సీమాంధ్రులు ఎన్ని కుట్రలు చేసినా టీ ఆగదు :హరీష్‌రావు

నిజామాబాద్‌ :సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌, లగడపాటి ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రం ఆగదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే400మంది ఎంపీలు మద్దతు ఇస్తారని ఆయన పేర్కోన్నారు. ముమ్మాటికి హైదరాబాద్‌…

జాతీయం

దిగ్విజయ్‌సింగ్‌తో మంత్రి గీతారెడ్డి భేటీ

ఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో రాష్ట్రమంత్రి గీతారెడ్డి ఇవాళ ఢిల్లీలో సమావేశమయ్యారు. సీబీఐ చార్జీషీట్‌లో మంత్రిగీతారెడ్డి ఏ9గా పేర్కొన్న విషయం తెలిసిందే.

హైదరాబాద్

ఇందిరాప్రియాదర్శిని ఆడిటోరియంలో ప్రారంభమైన టీఆర్‌ఎస్వీ సిర్ప్‌ హమార సదస్సు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం ఆద్వర్యంలో చేపట్టిన హైదరాబాద్‌ సిర్ఫ్‌ హమారా కార్యక్రమం నాంపల్లిలోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌, ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌, కవి,గాయకుడు దేశపతి శ్రీనివాస్‌,రసమయి బాలకిషన్‌ ,టీఆర్‌ఎస్వీ…