Thursday, 5 November 2026

September 2013

వార్తలు

భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అనురాగ్‌ శర్మ

హైదరాబాద్‌: గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా చార్మినార్‌ వద్ద భద్రతా ఏర్పాట్లను నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుందని చెప్పారు. రేపు ఉదయంలోగా నిమజ్జనం పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు.

వార్తలు

నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించిన కమిషనర్‌

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు ట్యాంక్‌బండ్‌పై జరుగుతున్న నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వినాయక నిమజ్జనానికి మొత్తం 59క్రేన్లు, 79మొబైల్‌క్రేన్లు, 5మంది గజ ఈతగాళ్లను అండుబాటులో ఉంచినట్లు కమిషనర్‌ తెలిపారు. ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో పేరుకు పోయిర చెత్తను ఎప్పటికప్పుడు…

వార్తలు

సమ్మె పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

హూదరాబాద్‌: ఏపీఎన్జీవోల సమ్మె పిటిషన్‌ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఏపీఎన్జీవోల సమ్మె చట్టవిరుద్దమంటూ హైకోర్టులో పిల్‌ దాఖలైన విషయం తెలిసిందే.

వార్తలు

బీజీపీ, బీఎస్పీ నేతలకు అరెస్టు వారెంట్లు

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌ జిల్లాలో జరిగిన అల్లర్ల కేసులో పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, మీఎస్సీ ఎంపీలకు పోలీసులు అరెస్టు వరెంట్లు జారీ చేశారు.

వార్తలు

నగరంలో పలుచోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌: నరగంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట ా, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లకు వర్షం వల్ల ఇబ్బంది ఏర్పడింది.

వార్తలు

కొనసాగుతున్న గణేష్‌ నియజ్జన ప్రక్రియ

హైవరాబాద్‌: ట్యాంక్‌బండ్‌ పై నిమజ్జన ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న రాత్రి నుంచి భారీగా నిలిచిపోయిన గణనాధులను ట్యాంక్‌బండ్‌ ఎన్జీఆర్‌ మార్గ్‌ సమాపంలో క్ల్రేన్ల ద్వారా నిమజ్జనం చేస్తున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన యువకులు గణేష్‌ మహారాజ్‌కు జై-జైతెలంగాణ నినాదాలు…

వార్తలు

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్‌

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో నిందితుడు వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. కేసు ఇంకా దర్యాప్తులో ఉన్నందున బెయిల్‌ ఇవ్వొద్దని, జగన్‌ పలుకుబడి ఉన్నందున సాక్షాలను తారుమారు చేసే…

వార్తలు

గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరిన టీడీపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: టీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ నరసింహన్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. మంత్రి గీతారెడ్డిని బర్తరఫ్‌ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే గవర్నర్‌ కోరనున్నట్లు సమాచారం.

వార్తలు

బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ ధర రూ.9లక్షల 26 వేలు

హైవరాబాద్‌: బాలాపూర్‌ లడ్డూను టీకేఆర్‌ విద్యాసంస్థలు యాజమాన్యం దక్కించుకుంది. టీకేఆర్‌ విద్యాసంస్థల తరపున లడ్డూను తీగెల కృష్ణారెడ్డి దక్కించుకున్నారు. వేలంలో లడ్డూ 9లక్షల 26వేల రూపాయలు పలికింది.

వార్తలు

బాలాపూర్‌ లడ్డూ వేలంపాట ప్రారంభం

హైదరాబాద్‌: బాలాపూర్‌ లడ్డూ వేలంపాట ప్రారంభమైంది. వేలంపాటను చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో బాలాపూర్‌ భక్తజనసంద్రంగా మారింది. 1994 సంవత్సరంలో తొలి సారిగా బాలాపూర్‌ లడ్డూ వేలం కొనసాగింది. అప్పుడు లడ్డూ రూ.450కి పలికింది. గత సంవత్సరం…