Tuesday, 3 November 2026

September 2013

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలొ ముగ్గురి మృతి

హైదరాబాద్‌: నల్గొండ జిల్లా మునగాల మండలం ఐటిపాముల వద్ద ఈ రోజు ఉదయం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.…

స్పొర్ట్స్

నాలుగో రౌండ్‌లో వెనుదిరిగిన స్విన్‌ దిగ్గజం

న్యూయార్క్‌: స్విస్‌ దిగ్గజం, మాజీ నెంబర్‌ వన్‌ ఆటగాడు రోజర్‌ ఫెదరర్‌ యూఎస్‌ ఓపెన్‌ లో నాలుగో రౌండ్‌లో వెనుదిరిగాడు. స్పెయిన్‌ దేశానికి చెందిన 19వ సీడ్‌ ఆటగాడు టామీ రోబ్రెడ్‌ చేతిలో 7-6, 6-3, 6-4 తేడాతో…

వార్తలు

కోర్టు ఆవరణలో వృద్ధుడి ఆత్మహత్య

హైదరాబాద్‌: కృష్ణాజిల్లా మైలవరంలో కోర్టు ఆవరణలో సోమవారం అర్థరాత్రి వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు జి.కొండూరు మండలం దుగ్గిరాల ాపాడుకు చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు.

వార్తలు

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

హైదరాబాద్‌: గంగవరం వెళ్లే గూడ్స్‌ రైలు విశాఖజిల్లా పెద గంట్యాడ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో గూడ్స్‌రైలు గార్డుకు గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వార్తలు

సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన తేదేపా

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత కుమారుడు సందీప్‌ దీక్షిత్‌పై తెదేపా పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు స్పీకర్‌ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఎంపీ శివ ప్రసాద్‌ను దూషించిన సందీప్‌ దీక్షిత్‌పై పార్లమెంట్‌లో ఆందోళన చేయాలని తెదేపా నిర్ణయంచింది.

వార్తలు

లారీ ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి

గన్నవరం: 16వ నెంబరు జాతీయ రహదారిపై కృష్ణా జిల్లా గన్నవరం వద్ద ఈరోజు ఉదయం లారీ ఢీకొని గుర్తు తెలియని మహిళ (40) మృతి చెందింది. మహిళపై నుంచి లారీ వెళ్లడంతో మృతదేహం గుర్తించేందుకు కూడా వీలులేకుండా ఉంది.…

జాతీయం

స్పైన్‌జెట్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌

తమిళనాడు: తమిళనాడులోని టూటికోరిస్‌లో స్పైస్‌జెట్‌ విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. విమానంలోని ఇంజిస్‌లో పోగలు రావడంతో అత్యవసరంగా విమానాన్ని దించివేశారు. విమానంలో ప్రయాణిస్తున్న 72 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.

వార్తలు

కాలువలో పడి రైతు మృతి

వినుకొండ పట్టణం: ప్రమాదవశాత్తు కాలువలోపడి రైతు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని నడిగడ్డలో జరిగింది. నడిగడ్డ గ్రామానికి చెందిన పత్తి కోటయ్య(51) ఈ రోజు ఉదయం మంచినీళ్లు తాగేందుకు కాలువ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు…

హైదరాబాద్

శాసనసభ వద్ద భారీగా మోహరించిన పోలీసులు

హైదరాబాద్‌: సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల దీక్ష నేపధ్యంలో శాసనసభ లోపల, వెలుపల పోలీసులు భారీగా మోహరించారు. మరి కొద్ది సేపట్లో మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టనున్నారు.

వార్తలు

రేపటి నుంచి గన్నవరం-ముంబాయి విమానసర్వీసు

గన్నవరం: గన్నవరం విమారనాశ్రయం నుంచి ప్రతిరోజు దేశ వాణిజ్య రాజధాని ముంబాయికి ఈ నెల 4నుంచి విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ప్రతి రోజు విమానం ముంబాయి నుంచి వయా హైదరాబాద్‌ మీదుగా మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం చేరుకుని,…