Tuesday, 3 November 2026

May 2014

వార్తలు

వరంగల్‌లో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్

వరంగల్ : జిల్లాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌కు చెందిన నదీం అనే దొంగను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నదీం నుంచి రూ. 25 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వార్తలు

గవర్నర్ సలహాదారు ఏఎన్ రాయ్‌తో డీజీపీ భేటీ

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్ సలహాదారు ఏఎన్ రాయ్‌తో డీజీపీ ప్రసాదరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితులతో పాటు శాంతి భద్రతల సమస్యపై చర్చించినట్లు సమాచారం.

వార్తలు

ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు 5 రోజులు ఆలస్యంగా రానున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. నైరుతి రుతు పవనాలు జూన్ 5న కేరళ తీరాన్ని తాకుతాయని పేర్కొంది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ…

వార్తలు

సీఎస్ మహంతితో ఉన్నతాధికారులు భేటీ

హైదరాబాద్ : సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సమావేశంలో విభజన ప్రక్రియపై చర్చించినట్లు సమాచారం. విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని ఉన్నతాధికారులకు సీఎస్ సూచించారు.

వార్తలు

ఒడిషాలో భూకంపధాటికి 70 మందికి గాయాలు

భువనేశ్వర్: ఒడిషాలో నిన్న సంభవించిన స్వల్ప భూకంపంలో 70 మందికి గాయాలయినట్లు అదనపు కమిషనర్ పీకే మోహపత్ర తెలిపారు. భూమి కంపించిన సమయంలో పరిసర ప్రాంతాల ప్రజలు బహుళ అంతస్థుల భవనాల నుంచి పరుగులు తీయడంతో 70 మందికి…

వార్తలు

హామీలు నెరవేర్చేవరకు పోరాటం చేస్తాం:రఘువీరా

హైదరాబాద్:ఇటీవల ఎన్నికల్లో గెలిచిన పార్టీలు ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు పోరాడతామని కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం రైతు రుణాలను వెంటనే మాఫీ చేయాలని విజ్ఙప్తి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ పార్టీలు ఓటమి పాలైనపుడు…

వార్తలు

థాయిలాండ్‌లో సైనిక పాలన

బ్యాంకాక్ : థాయిలాండ్‌లో సైనిక పాలన మొదలైంది. థాయిలాండ్ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి సైన్యం అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిపక్షాలు… రిగ్గింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేస్తూ కొంతకాలంగా పాలనపక్షానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాయి. ప్రధాని తక్షణమే…

వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్-40.8, తిరుపతి-42.6, గన్నవరం-42, ఒంగోలు-43.6, కర్నూలు 39.4, అనంతపురం-38, నెల్లూరు-42.6, కావలి-43, మచిలీపట్నం- 43.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వార్తలు

కొనుగోళ్లు నిలిచిపోవడంతో పసుపు రైతుల ఆందోళన

నిజామాబాద్: మార్కెట్‌యార్డులో కొనుగోళ్లకు సెలవు ప్రకటించిన విషయం తెలియక ధాన్యం, పసుపు లోడ్‌తో వచ్చిన రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిఉన్నారు. నిజామాబాద్ మార్కెట్‌యార్డుకు ఈ నెల 24 వరకు అధికారులు సెలవు ప్రకటించారు. ధ్యాన్యం, పసుపు నిల్వలు పేరుకుపోయినందున…

వార్తలు

ఎంసెట్ మెడిసిన్‌కు ‘ఆర్’ కోడ్ ప్రశ్నాపత్రం ఎంపిక

హైదరాబాద్,మే 22 : రాష్ట్రవ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం జరుగనున్న ఎంసెట్ మెడికల్‌కు ‘ఆర్’ కోడ్ ప్రశ్నాపత్రాన్ని అధికారులు ఎంపిక చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. మెడిసిన్…