Wednesday, 4 November 2026

March 2015

హైదరాబాద్

మాజీ మేయరు లక్ష్మీనారాయణ మృతి

హైదరాబాద్‌ నగర మాజీ మేయరు లక్ష్మీనారాయణ కన్నుమూశారు. గన్‌పార్కులో అమరవీరుల స్థూపాన్ని ఆయన నిర్మించారు. లక్ష్మీనారాయణ మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు.

జాతీయం

నిర్భయ డాక్యుమెంటరీపై రాజ్యసభలో ఆందోళన

దిల్లీ: నిర్భయ డాక్యుమెంటరీపై రాజ్యసభలో చర్చ జరిగింది. నిర్భయ కేసులో దోషి ముఖేష్‌ ఇంటర్వ్యూను రాజ్యసభ ఖండించింది. డాక్యుమెంటరీపై తీసుకున్న చర్యలను సభకు తెలపాలని రాజ్యసభ ా’య్రర్మన్‌ హమీద్‌ అన్సారీ సూచించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేంద్ర ముఖ్తార్‌…

మెదక్

బాలసదన్‌ బాలికల ధర్నా

మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌లోని బాలసదన్‌లో వార్డెన్‌ మద్యం తాగి తమను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ బాలికలు తహసీల్దారు కార్యాలయం ముందు ధర్నా చేశారు. మద్యం తాగి వేధిస్తున్న వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాలికలు డిమాండ్‌ చేశారు. ఈ సంధర్భంగా…

హైదరాబాద్

బాబు రాక బ్లాక్ డే: టిఆరెస్

హైదరాబాద్ (మార్చి 04): ఏపీ సిఎం చంద్రబాబు కరీంనగర్ పర్యటనను బ్లాక్‌డేగా పరిగణిస్తున్నామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రైతాంగానికి చంద్రబాబు చేసిందేమీ లేదని, బాబ్లీ ప్రాజెక్ట్‌పై పోరాటమంటూ మహారాష్ట్ర సర్కారుతో వివాదం తీసుకొచ్చారని ఆరోపించారు.…

హైదరాబాద్

రంగారెడ్డి: హైకోర్టు విభజన కోసం న్యాయవాదుల ఆందోళన

వికారాబాద్‌ (మార్చి 04): ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలన్న డిమాండ్‌తో తెలంగాణ న్యాయవాదుల ఆందోళనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా వికారాబాద్ న్యాయవాదులు విధులు బహిష్కరించారు. తక్షణం హైకోర్టును విభజించాలని ఆందోళన చేపట్టారు.

హైదరాబాద్

98 హామీలు ఏమయ్యాయి? – షబ్బీర్‌అలీ

హైదరాబాద్‌, (మార్చి 4) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ గడిచిన 8 నెలల్లో 101 హామీలిచ్చి మూడు మాత్రమే నెరవేర్చారు. మరి మిగిలిన 98 హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్‌ మాజీమంత్రి, ఎమ్మెల్యే షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన…

హైదరాబాద్

కేసీఆర్‌ అధికారం శాశ్వతం కాదు – కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, (మార్చి 4): అధికారం శాశ్వతం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తుంచుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి హెచ్చరించారు. విద్యార్ధులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ నిధులు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేసారు. లేనిపక్షంలో తాను ఆమరణ…

హైదరాబాద్

హైకోర్టు విభజన తెలంగాణ సమస్య – మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

హైదరాబాద్‌,(మార్చి 4): హైకోర్టు విభజన కేవ లం తెలంగాణ న్యాయవాదుల సమస్య మాత్రమే కాదని, తెలంగాణ సమస్యని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కే సీఆర్‌ హైకోర్టు విభజన విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారని ఆయన అన్నారు.…

హైదరాబాద్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్‌కు షాకిస్తాం – టీ.టీడీపీ అధ్యక్షుడు రమణ

హైదరాబాద్‌, (మార్చి 4): ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాకిస్తామని టీ.టీడిపీ అద్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ముందుకెళ్తామని ఆయన ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించేందుకు ఇవాళ బీజేపీ – టీడీపీ నేతలు భేటీ…

జాతీయం

హజారేని చంపే సమయం వచ్చింది… నేను కాబోయే గాడ్సేనంటూ కెనడా ఎన్నారై

ముంబై: సామాజిక కార్యకర్త, ప్రముఖ గాంధేయవాది అన్నా హజారేకు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ద్వారా బెదిరింపు సందేశాలు వచ్చాయి. దీంతో అన్నా హజారే ఆఫీసు వర్గాలు ముంబైలోని థానే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కెనడాకు…