Tuesday, 3 November 2026

August 2015

సీమాంధ్ర

మునికోటి మృతి

తిరుపతి : కాంగ్రెస్ కార్యకర్త మునికోటి మృతి చెందారు. ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం తిరుపతిలో కోటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని చెన్నైకి తరలించారు. ఆదివారం కేఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

తెలంగాణ

మునికోటి మృతిపై రఘువీరా..చిరంజీవి సంతాపం..

హైదరాబాద్ : ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్త మునుకోటి మృతి చెందడంపై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. కోటి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రత్యేకహోదా…

తెలంగాణ

నేడు మహారాష్ట్ర గవర్నర్‌ సాగర్‌జీ రాక

కరీంనగర్‌ టౌన్‌ : మహారాష్ట్ర గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఆదివారం కరీంనగర్‌కు వస్తున్నట్లు తెలిసింది. హైదరాబా ద్‌ నుంచి మధ్యాహ్నం బయలు దేరి 3 గంటలకు కరీంనగర్‌కు చేరుకుని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో కొద్దిసేపు విశ్రాంతి…

తెలంగాణ

ఖమ్మం: బాలుడిపై పందుల దాడి

మణుగూరుటౌన్‌: ఓ బాలుడిపై పందులు దాడిచేసి గాయపరిచాయి. మణుగూరు మునిసిపాలిటీ పరిధిలోని బాపనకుంట గ్రామంలో సిలివేరు నవీన్‌ అనే బాలుడిపై శనివారం పందులు దాడిచేసి గాయపరిచాయి. అంతేకాకుండా పెంపుడు కుక్కపై దాడిచేయగా అది మృతి చెందింది. పందులు దాడి…

తెలంగాణ

భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త, పరిస్థితి విషమం

ఖమ్మం, ఆగస్టు 8 : క్షణికావేశంలో భార్యపై భర్త కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో జరిగింది. ముద్దనూరు గ్రామంలో నివసముంటున్న దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త…. భార్యపై కిరోసిన్…

తెలంగాణ

ఘరానా మోసగాడు అరెస్ట్

హైదరాబాద్‌, ఆగస్టు 09:వెస్ట్‌జోన్‌ పరిధిలో ప్రభుత్వాధికారినంటూ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి రూ. 20 వేలు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అతడి మోసాలపై దృష్టిసారించిన పోలీసులు మోసగాడిని చాకచక్యంగా పట్టుకున్నారు.…

తెలంగాణ

గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం

ఖమ్మం, ఆగస్టు 09:  భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 22.5 అడుగులు ఉంది. నీటిమట్టం పెరుగుతుండడంతో స్నానఘట్టాల దగ్గర భక్తులు లోతట్టుప్రాంతాలకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక జారీచేశారు.

తెలంగాణ

అటవీ అధికారులపై న్యూడెమోక్రసీ నేతల దాడి

ఖమ్మం, ఆగస్టు 09: హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ అధికారులుపై కొందరు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఇల్లందు డివిజన్‌లో చోటుచేసుకుంది. డివిజన్‌లోని పోడుభూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులు, కూలీలపై న్యూడెమోక్రసీ నేతల…

తెలంగాణ

నాటువైద్యం వికటించి 15మందికి అస్వస్థత

మహబూబ్‌నగర్, ఆగస్టు 09: నాటువైద్యం వికటించి పలువురు అస్వస్థతకు గురైన సంఘటన ఫరూఖ్‌నగర్ మండలం కంసాన్‌పల్లిలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న 15మంది గ్రామస్తులు ఓ నాటువైద్యుడిని సంప్రదించగా ఆయన చికిత్స చేశాడు. అయితే ఆ వెంటనే వారు తీవ్ర…

తెలంగాణ

కొనసాగుతున్న బోనాల సమర్పణ

హైదరాబాద్, ఆగస్టు 09: రాష్ట్రవ్యాప్తంగా బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. తల్లులను దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే బోనాలతో బారులు తీరారు. దీంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ కోలాహలంగా మారింది. మహంకాళి, ఎల్లమ్మ, పోచమ్మ…