Friday, 6 November 2026

ఆదిలాబాద్

కోలిండియాక్రికెట్‌ఏర్పాట్ల పరిశీలన

రామకృష్ణాపూర్‌, న్యూస్‌టుడే:రామకృష్ణాపూర్‌ పట్టణంలోని ఠాగూర్‌ మైదానంలో కోలిండియా క్రికెట్‌ పోటీల కోసం చేపట్టిన ఏర్పాట్లను ఆదివారం క్రీడాసంఘాల నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్‌ సంఘం ప్రధాన కార్యదర్శి పి.రఘనాథ్‌రెడ్డి, బాడీ బిల్డింగ్‌ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు…

విద్యావలంటీర్ల సమావేశం

కెరమెరి: మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆదివారం మండలంలోని విద్యావలంటీర్ల సమావేశం నిర్వహించారు. గత నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడంపై అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యావలంటీర్లతో ప్రభుత్వ పాఠశాలల్లో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆ…

మహిళ మెడలో గొలుసు చోరీ

ఆదిలాబాద్‌ క్రైమ్‌: ఆదిలాబాద్‌ పట్టణంలో ఆదివారం ఉదయం హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన సోమనాగమ్మ అనే మహిళ మెడలోంచి 2 తులాల మంగళసూత్రాన్ని దొంగలు లాక్కెళ్లారు. ఇంటినుంచి ఆస్పత్రికి వెళ్తున్న తన మెడలోంచి వాహనం పై వచ్చిన ఇద్దరు…

పోలియో చ్కులు వేసిన ఎమ్మెల్యే

కాగజ్‌నగర్‌: పట్టణంలో పల్స్‌పోలియో సందర్భంగా చిన్నారులకు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య పోలియో చుక్కలను వేశారు. పోలియో చుక్కలు వేయడానికి పట్టణంలో 55 కేంద్రాలు, మండలంలో 34 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.

భాజపా ఆధ్వర్యంలో బంద్‌

ఖైంసా: దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లకు నిరసనగా భాజపా ఆధ్వర్యంలో ఖైంసా పట్టణంలో బంద్‌ పాటించారు. ఈ సందర్భంగా వ్యాపారులు స్వచ్చందంగా మద్దతునిచ్చారు. ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని ఖైంసా డిపో ఎదుట భాజసా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.…

కాగజ్‌నగర్‌లో విద్యా సంస్థలకు ముందస్తు సెలవు

కాగజ్‌నగర్‌: హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్లకు నిరసనగా కాగజ్‌నగర్‌లో విద్యా సంస్థలు బంద్‌ పాటించాయి. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల యజమానులు ముందస్తు సెలవు ప్రకటించారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ

వాంకిడి:దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్వాలీ నిర్వహించారు. స్థానిక హనుమాన్‌ మందిరం నుంచి ప్రారంభమైన బన్‌స్టాండ్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా సీఐటీయూ ఆసిఫాబాద్‌ డివిజన్‌ అధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ కార్మిక…

రేపు గోండి మాతృభాష దినోత్సవం

జైనూరు, న్యూస్‌టుడే: మండలంలోని చారిత్రాత్మక గ్రామం మార్లవాయిలో ఈనెల 21న గోండి మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నట్లు రాయిసెంటర్‌ జిల్లా సార్‌మెడి మెస్రం దుర్గు అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయిసెంటర్ల(గిరిన్యాయస్థాన)ను పటిష్ఠపర్చడంతో పాటు…

నేడు కాగజ్‌నగర్‌కు మందకృష్ణ రాక

ఎస్పీఎం ద్వార(కాగజ్‌నగర్‌),న్యూస్‌టుడే: ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ బుధవారం కాగజ్‌నగర్‌కు రానున్నట్టు అణగారిన కులాల ఐక్య పోరాట సమితి ప్రతినిధి రజీహైదర్‌.ఎస్పీఎం కార్మికసంఘం నాయకుడు ఈర్ల సతీష్‌కుమార్‌ తెలిపారు. బుధవారం ఉదయం ఏడుగంటలకు ఎస్పీఎం ద్వారం వద్ద మందకృష్ణ…

24న జిల్లా ఆర్యవైశ్య ఎన్నికలు

బెల్లంపల్లిటౌన్‌, న్యూస్‌టుడే: ఈ నెల 24న జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికలు బెల్లంపల్లిలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.విద్యాసాగర్‌, ప్రధానకార్యదర్శి పాత భాస్కర్‌, కోశాధికారి ఎం. రత్నాకర్‌, అసోసియేట్‌ ఈసీ…