Saturday, 7 November 2026

కరీంనగర్

రామన్నపల్లిలో పంచాయితి సిబ్బందిన నిర్భందించిన గ్రామస్థులు

జమ్మికుంట:మండలంలోని రామన్నపల్లి నీటి పథకానికి విద్యుత్‌ మోటరు అమర్చాలని బీడీ కాలనీ వాసులు గ్రామపంచాయితీ సిబ్బందిని నిర్భందించారు. పైప్‌లైన్‌ వేసినప్పటికీ ఇంత వరకు బోర్‌కు మోటరు అమర్చలేదని తెలిపారు. వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

ఎన్టీపీసీ నాలుగో యూనిట్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

గోదావరిఖని : రామగుండం ఎన్టీపీసీలోని నాలుగో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నలిచిపోయింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ కారణంగా సమస్య తలెత్తినట్లు అధికారులు గుర్తించి మరమ్మతు పనులు చేపట్టారు.

‘జనంసాక్షి’ పత్రిక భేష్‌: లోకాయుక్త న్యాయమూర్తి కృష్ణాజిరావు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): మన ‘జనంసాక్షి’ దినపత్రికలో ప్రచురితమవుతున్న వార్తలు స్వచ్ఛంగా ఉంటున్నాయని రాష్ట్ర ఉప లోకాయుక్త జడ్జి కృష్ణాజీ రావు ప్రశంసించారు. శనివారం ఆయన కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.…

రైతు బజారును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఉపలోకయుక్త జడ్జి

కరీంనగర్‌: కరీంనగర్‌ శనివారం అంగడి బజారులోని రైతు బజారును రాష్ట్ర ఉప లోకాయుక్త ఎంవీఎన్‌ కృష్ణాజీరావు ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుద్ధ్య పనులు, ఉద్యోగుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇద్దరు అటెండర్లు గైర్హాజరులో ఉన్నట్లు…

మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన సదస్సు

ఎలిగేడు: ఎంపీడీవో కార్యలయంలో మండలస్థాయి అధికారులకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఉన్నాతాధికారులు మాట్లాడుతూ 1000 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయని, అధికారులు లక్ష్య సాధనతో ముందుండి జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచేలా కృషి చేయాలన్నారు.

ప్రత్యేక వైద్య శిభిరాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

ధర్మారం మండలంలోని మేడారం పీహెచ్‌సీలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్‌ స్మితసబర్వాల్‌ ప్రారంబించారు. కరీంనగర్‌లోని ప్రతిమ యాజమాన్యంతో గతవారం క్రితం పర్యటన సందర్బంగా చేసుకున్న ఒప్పందం మేరకు ప్రతిమ అసుపత్రి సహకారంతో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.…

రైలునుంచి పడి యువకునికి తీవ్ర గాయాలు

  జమ్మికుంట గ్రామీణం జమ్మికుంట మండలం విలా సాగర్‌ గ్రామ సమీపంలో రైలునుంచి పడి 20ఏళ్ల గుర్తు తెలియని యువకునికి తీవ్ర గాయాలయ్యాయి తలకు తీవ్ర గాయాలుకాగా జమ్మికుంటలోని ప్రభుత్వ అసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించారు. పరిస్థితి అందోళనకరంగా…

గ్రానైట్‌ లారీలను అడ్డుకున్న గ్రామస్థులు

  గంగాధర అధిక బరువుతో గ్రానైట్‌ రవాణా చేస్తున్న లారీల వల్ల గంగాధర – బూరుగుపల్లి ప్రధాన రహదారి పూర్తిగా శిథిలమైందని అందోళన చెందుతూ శుక్రవారం గంగాధర గ్రామస్థులు గ్రానైట్‌ లారీలను అడ్డుకున్నారు. గ్రానైట్‌ లారీల వల్ల రోడ్డు…

వైద్యశిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

  మెట్‌పల్లి హైదరాబాద్‌ యశోదా అస్పత్రి నేతృత్వంలో మెట్‌పల్లి సామాజిక అస్పత్రిలో నిర్వహిస్తున్న చెవి, ముక్కు, గోంతు,ఉచిత వైద్య శిబిరాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ప్రారంబించారు. 12 మంది వైద్యులు శిబిరంలో రోగులను పరీక్షించారు.

వైద్యశిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

  మెట్‌పల్లి హైదరాబాద్‌ యశోదా అస్పత్రి నేతృత్వంలో మెట్‌పల్లి సామాజిక అస్పత్రిలో నిర్వహిస్తున్న చెవి, ముక్కు, గోంతు,ఉచిత వైద్య శిబిరాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ప్రారంబించారు. 12 మంది వైద్యులు శిబిరంలో రోగులను పరీక్షించారు.