మహబూబ్ నగర్

దళిత బంధు యూనిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 25 దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకు వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు …

డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అచ్చంపేట ఆర్సి ఆగస్టు 25 జనం సాక్షి న్యూస్ రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా వెళ్లి పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించగా మండల నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ నేతలు , రైతులు విద్యుత్తు సరఫరా సమస్య లపై మాట్లాడారు .అనంతరం ధర్నా ను ఉద్దేశించి డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ..రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు ను సరఫరా చేయడంలో టీఆరెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.24 గంటలు ఏమోగానీ అన్నదాతలకు కనీసం16 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తే బాగుంటుందని అన్నారు.ప్రస్తుతం రైతులకు 9గంటలు సరఫరా అవుతున్న వోల్టేజి కరెంట్ వలన ట్రాన్స్ఫార్మర్స్,స్టార్టర్ లు కాలిపోతున్నాయని, తద్వారా సగం మడి కి మాత్రమే నీళ్లు పారుతుందని ఇలా అరకొరగా నీళ్లు అందడంతో పంటలు నష్టం జరుగుతుందని అన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాగర్ కర్నూలు, కొల్లాపూర్ వచ్చి భారతదేశం లోనే 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పలు పోయాడని, అలాగే ఇటీవలే మునుగోడు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రైతులకు మీటర్లు పెడుతున్నారని ఓ పార్టీని విమర్శించిన కేసీఆర్ ముందు క్షేత్రస్థాయిలో రైతులు పడే కష్టాలను తెలుసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. అసలు అప్పుకట్టకున్న మిత్తి ఎక్కువైనా సరే కడుతా అన్నట్లు ఉంది కేసీ ఆర్ వ్యవహార శైలి అని వ్యంగంగా చమత్కరించారు. రాష్ట్రంలో రైతులు ఓ వైపు ఆత్మహత్య చేసుకుని చనిపోతుంటే కెసిఆర్ మాత్రం పంజాబ్ రైతులకు మూడు లక్షల చొప్పున అందజేయడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే డొమెస్టిక్ విద్యుత్ చార్జీలను రెండుసార్లు పెంచిందన్నారు. కేవలం ఒక రూమ్ గల ఇండ్లలో నివసిస్తున్న నిరుపేద ఎస్సి ఎస్టీ ప్రజల నుండి సబ్సిడీ లేకుండా కరెంటు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికి చెల్లిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముగ్గురు రైతులు కలిసి డీడీలు కడితే వారికి ట్రాన్స్ ఫార్మర్ లు, కరెంట్ వైర్లు, సంబంధిత పరికరాలు అందజేసేవారని, కానీ ప్రస్తుతం ముగ్గురు రైతులుకలిసి డిడి కట్టినా కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా సకాలంలో వచ్చే పరిస్థితి లేదని అన్నారు. కొండనాలుకకు మందు ఏస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్న చందంగా అన్నట్లు రైతుల పాలిట కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 15 రోజులలోగా రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్తును సరఫరా చేయడమే గాక సకాలంలో ట్రాన్స్ఫార్మర్లు అందజేసి రైతులకు వ్యవసాయపరంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. లేనియెడల మా నాయకులు టి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల తో ప్రతి సబ్ స్టేషన్ ముందు రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేనులతో కలిసి రైతుల సమస్యలు తీర్చాలని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు మెమోరాండం అందజేశారు. కార్యక్రమంలో గౌరీ శంకర్, కటకం రఘురాం, బ్లాక్ కాంగ్రెస్ నేత గోపాల్ రెడ్డి, మస్తాన్ ,బాల్ లింగం గౌడ్, చత్రు నాయక్, అవుట శ్రీనివాసులు, హరిచంద్ర సంతోష్ నాయక్, అంజి యాదవ్, మహబూబ్ అలీ, రాజగోపాల్ ,కుంద మల్లికార్జున్, సుశీల, రాజు, పవన్ కుమార్ ,లతోపాటు నియోజకవర్గ పరిధిలోని మండల గ్రామాల నుండి రైతులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భారత దేశ వాక్సిన్ ఉత్పత్తి ప్రపంచనికి ఎంతో ఉపయోగం – గవర్నర్ –కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవం కార్యక్రమంలో..గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ హన్మకొండ బ్యూరో చీఫ్ …

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిచడం లో టీఆరెస్ ప్రభుత్వం విఫలమైంది.

డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అచ్చంపేట ఆర్సి ఆగస్టు 25 జనం సాక్షి న్యూస్ రైతులకు …

*పాండవుల గుట్టను పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా*

*భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి* *బుగులోని గుట్ట వద్ద శివాలయం నిర్మాణానికి భూమి పూజ* రేగొండ (జనం సాక్షి): పాండవుల గుట్టలను,బుగులోని జాతర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా …

ఉమామహేశ్వర క్షేత్రానికి వెండి ఆభరణాలు బహుకరించిన దడువై రవికుమార్ దంపతులు

ఆర్సి, ఆగస్టు 25( జనం సాక్షి న్యూస్) : నియోజకవర్గం లోని శ్రీశైల ఉత్తర ద్వారం అయిన ప్రముఖ పుణ్యక్షేత్రం ఉమామహేశ్వర ఆలయంలోని మహిషాసుర మర్దిని అమ్మవారికి …

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిచడం లో టీఆరెస్ ప్రభుత్వం విఫలమైంది.

డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అచ్చంపేట ఆర్సి ఆగస్టు 25 జనం సాక్షి న్యూస్ రైతులకు …

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిచడం లో టీఆరెస్ ప్రభుత్వం విఫలమైంది.

  డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.     అచ్చంపేట ఆర్సి ఆగస్టు 25 జనం …

సెప్టెంబర్ 9న సింగరేణి కాంట్రాక్టుకార్మికులసమ్మె ను జయప్రదంచేయండి

–సింగరేణి కాంట్రాక్టుకార్మి కసంఘాలజేఏసీపిలుపు షేక్ యాకుబ్ షావలి డి ప్రసాద్ రామ్ చందర్ . వీరన్న .రాయండ్ల కోటి లింగం. టేకులపల్లి ఆగస్టు 25( జనం సాక్షి …

బాలికల పాఠశాలను సందర్శించిన ఆడిషినల్ కలెక్టర్

  మహబూబాబాద్ బ్యూరో-ఆగష్టు24(జనంసాక్షి) బుధవారం మహబూబాబాద్ జిల్లాల్లోని గుడూరు ఆశ్రమ బాలికల పాఠశాలను అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ నందు విద్యార్దులు …

*వజ్ర సంకల్పంలో భాగంగా పల్లెనిద్ర కు హాజరైన అదనపు ఎస్పీ*

*గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(24):* వజ్ర సంకల్పంలో భాగంగా గోపాల్ పేట్ గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమానికి వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ హాజరయ్యారు …