Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ బిందెలతో రాస్తారోకో

ధన్వాడ: తాగునీటి సమస్య పరిష్కరించాలని చిన్నగరపల్లి గ్రామస్థులు తాండూరు-మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలోని బోర్లన్నీ వట్టిపోయాయని… తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి హామీ ఇచ్చేంతవరకూ…

ఆర్టీసీ బస్సు-మినీ లారీ ఢీకొని తొమ్మిది మందికి గాయాలు

పెబ్బేరు: పెబ్బేరు సమీపంలో ఈరోజు మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ,మినీ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మినీ లారీలో ప్రయాణిస్తున్న తొమ్మిది మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని 108లో వనపర్తి ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని బాలుడు మృతి

ఇటిక్యాల: మండల పరిధిలోని జింకలపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొని నర్సింహులు (6) అనే బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం…

డీసీఎం వ్యాన్‌ బోల్తా-ఒకరి మృతి

కొత్తకోట (గ్రమీణం):  డీసీఎం వ్యాన్‌ బోల్తా పడి ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని కనిమెట్ట వద్ద చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్వరరావు కథనం ప్రకారం వరంగల్‌ చిట్యాలకు చెందిన శ్రీనివాసులు (28) పశువుల వ్యాపారం నిమిత్తం హైదరాబాద్‌ వైపు…

ఛార్జీషీటు పూర్తి కానందున మళ్లి న్యాయస్థానంకు హాజరు కావలేను

మహబూబ్‌నగర్‌: ఈ కేసులో ఛార్జిషీటు ఇంకా దాఖలు కాలేదని, ఛార్జిషీటు దాఖలు చేసిన తర్వాత మరోసారి న్యాయస్థానం ముందు హాజరు కావాలని కోదండరాం బృందాన్ని అలంపూర్‌ న్యాయస్థానం ఆదేశించింది. రిమాండ్‌ గడువు ముగియడంతో ఐకాస, తెరాస నేతలు ఈరోజు…

పాలమూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం ,ఒకరి మృతి

మహాబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మానవపాడు మండలం ఉండవల్లి సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకోనడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడినవారి…

అలంపూర్‌ కోర్టులో హాజరైనా కోదండరాం ,ఈటెల

మహాబూబ్‌నగర్‌ : సడక్‌ బంద్‌ కేసులో తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ కోదండరాం, టీఆర్‌ఎస్‌ నేతలు ఈటెల రాజేందర్‌ , జితేందర్‌రెడ్డిలు గురువారం అలంపూర్‌ కోర్టుకు హాజరయ్యారు. హైదరాబాద్‌ -కర్నూల్‌ జాతీయ రహదారిపై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్‌…

అలంపూర్‌ కోర్టుకు హాజరైన టీ జేఏసీ నేతలు

మహబూబ్‌నగర్‌ : సడక్‌బంద్‌ కేసులో టీఆర్‌ఎస్‌ నేతలు, జేఏసీ నేతలు ఇవాళ అలంపూర్‌ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వాయిదాకు హాజరైన వారిలో టీ జేఏసీ నేతలు ప్రొ.కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్షనేత ఈటెల, జూలల్లి, జితేందర్‌రెడ్డి ఉన్నారు.

అలంపూర్‌ కోర్టుకు హాజరైన ఐకాస, తెరాస నేతలు

మహబూబ్‌నగర్‌: సడక్‌బంద్‌ కేసులో తెలంగాణ ఐకాస కన్వీనర్‌ కోదండరాం. శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు ఈరోజు అలంపూర్‌ కోర్టుకు హాజరయ్యారు. రిమాండ్‌ గడువు ముగియడంతో తెరాస నేతలు ఈటెల రాజేందర్‌, జూపల్లి కృష్ణారావు, జితేందర్‌ రెడ్డి న్యాయస్థానానికి హాజరయ్యారు.

జిల్లాలో విజృంభించిన చికెన్‌గున్యా

ఉట్కూరు: మహబూబ్‌నగర్‌ జిల్లా ఉట్కూరు మండలం పెద్దపొర్లలో చికెన్‌గున్యా విజృంభించింది. దీంతో పలువురు గ్రామస్థుతకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యాధికారులు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి గ్రామస్థులకు చికిత్స అందిస్తున్నారు.