Wednesday, 25 November 2026

హైదరాబాద్

లోక్‌సభ స్పీకర్‌ అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు సజావుగా సాగేందుకు స్పీకర్‌ మీరాకుమార్‌ అన్ని పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సభాకార్యక్రమాలను అడ్డుకోవద్దని నేతలను కోరారు. మరోవైపు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ విపక్ష నేత సుష్మాస్వరాజ్‌తో భేటీ…

గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన తెలంగాణ ఎంపీలు

న్యూఢిల్లీ, జనంసాక్షి: పార్లమెంట్‌లో గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు వివేక్‌, పొన్నం ప్రభాకర్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజయ్య నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చేస్తున్న సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా ఈ ప్రదర్శన నిర్వహించారు.

మహిళలపై వేధింపుల నిరోధానికి ప్రత్యేక టాన్క్‌ఫోర్స్‌

కర్నూలు: మహిళలపై వేధింపుల నిరోధానికి చర్యలు చేపట్టినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌ వెల్లడించారు. ఇందుకోసం సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమించినట్లు ఆయన చెప్పారు.

టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మెదక్‌, జనంసాక్షి: మరోసారి సీమాంధ్ర సర్కారు తన దురహంకారాన్ని ప్రదర్శించింది. సీఎం కిరణ్‌ జిల్లాలో ఇవాళ పర్యటించనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పలువురు తెలంగాణవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం కిరణ్‌  జిల్లా పర్యటనలో తెలంగాణ వాదులు…

మైరుగైన చికిత్స కోసం ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించారు

ఇస్లామాబాద్‌: తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడ్డ భారత్‌ వాసి సరబ్‌జిత్‌ సింగ్‌కు మెరుగైన చికిత్స అందించేందుకు విదేశాలకు పంపే అంశంపై పాక్‌ ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. మరోవైపు లాహోర్‌లోని జిన్నా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సరబ్‌జిత్‌ అరోగ్యం…

సీబీఐ కోర్టుకు గైర్హాజరైన శ్రీలక్ష్మి

హైదరాబాద్‌, జనంసాక్షి: ఓఎంసీ కేసులో నిందితురాలు , ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి కోర్టుకు హాజరు కాలేదు. ఈ కేసులో ఇవాళ ఆమె కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా తాను కోర్టుకు హాజరుకాలేక పోతున్నానని ఆమె తన…

తెలంగాణ ఐకాస సత్యాగ్రహ దీక్ష

న్యూఢిల్లీ : తెలంగాణ ఐకాస ‘సత్యాగ్రహ దీక్ష’ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఈ ఉదయం ప్రారంభమైంది. దీక్షలో ఐకాస అధ్యక్షుడు కోదండరాం, ఉద్యోగ సంఘాలు, ఐకాస నేతలు పాల్గొన్నారు. రెండ్రోజులపాటు ఈ దీక్ష కొనసాగనుంది. భాజపా నేత సుష్మాస్వరాజ్‌…

పార్లమెంట్‌లో ఆందోళన చేపట్టిన తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌ అవరణలో ఆందోళనకు దిగారు. పార్లమెంట్‌ ఒకటో గేటు వద్ద భైఠాయించి తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని కోరారు. తెలంగాణ సాధన కోసం 48 గంటలపాటు దీక్ష కొనసాగిస్తామని…

ఢాకా బాధితులను పరామర్శించిన హసినా

ఢాకా, జనంసాక్షి: గతవారం ఢాకాలో ఎనిమిదంస్థుల భవనం కుప్పకూలిన ప్రాంతాన్ని బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసినా సందర్శించారు. సహాయ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ నెల 24న రాణా ప్లాజా వాణిజ్య…

పెషావర్‌లో ఆత్మాహుతి దాడివల్ల ఆరుగురి మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో పెషావర్‌లో ముష్కరులు మరోసారి పేట్రేగిపోయారు. పోలీసు వ్యాన్‌ లక్ష్యంగా అత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా… 40 మంది గాయాలయ్యాయి. వెంటనే అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.