Wednesday, 25 November 2026

హైదరాబాద్

విద్యార్థిని ఆత్మహత్య

నల్లగొండ, కనగల్‌ మండలం హైదలాపురంలో విషాదం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వేధింపులే విద్యార్థిని ఆత్మహత్యకు కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

వాయిదా పడిన పార్లమెంట్‌ ఉభయసభ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే 2జీ, బొగ్గుకుంభకోణం అంశాలపై విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. ప్రధాని రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్నం…

వైఎస్సార్‌తో బాబుకు పోలిక లేదు:ఎంపీ సబ్బం హరి

విశాఖపట్నం, జనంసాక్షి:  వైఎస్సార్‌ పాదయాత్రతో చంద్రబాబు పాదయాత్రకు పోలికే లేదని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. ఉదయం 5 గంటలకు నిద్రలేచి పద్దతి ప్రకారం ప్రజలతో మమేకమై వైఎస్‌ఆర్‌ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. బాబు పాదయాత్రకు…

సీబీఐ కోర్టు ముందు హాజరైన ఎమ్మార్‌, ఓఎంసీ కేసు నిందితులు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో సీబీఐ కోర్టు ఎదుట బీపీ ఆచార్య, విజయ రాఘవ , కోనేరు ప్రసాద్‌ ఈ ఉదయం హాజరయ్యారు. మరోవైపు ఓఎంసీ కేసులో రాజగోపాల్‌ కోర్టు ముందు హాజరయ్యారు.

అక్రమంగా తరలిస్తున్న 3 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

చిత్తూరు, జనంసాక్షి: అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది టన్నుల ఎర్రచందనం దుంగలను గాజులమండ్యం పోలీసులు పట్టుకున్నారు. రేణిగుంట చెక్‌పోస్టు వద్ద ఎర్రచందనాన్ని తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు అధికారులు ప్రయత్నించారు. లారీ డ్రైవర్‌ వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో దగ్గరలోని గాజుల మండ్యం…

నేడు సుష్మాస్వరాజ్‌తో భేటీ కానున్న కమల్‌నాథ్‌

న్యూడిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ ఈరోజు లోక్‌సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్‌తో భేటీ కానున్నారు. పార్లమెంట్‌ సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా కోరనున్నారు. 2జీ, బొగ్గుకుంభకోణం అంశాలపై గత కొన్ని రోజులుగా భాజపా పార్లమెంట్‌ ఉభయసభల్లో ఆందోళన…

మూడు లారీలు ఢీకొని ఒకరి మృతి

జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పొగాకు బోర్డు వద్ద ఈ ఉదయం మూడు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా… నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

బస్సు- ఆటో ఢీ: ఇద్దరికి గాయాలు

నల్లగొండ, జనంసాక్షి: ఆర్టీసీ బస్సు -ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. చౌటుప్పల్‌ మండలం రెడ్డిబావి వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

శ్రీపతి రాజేశ్వర్‌కు నివాళి అర్పించిన తెదేపా అధినేతలు

హైదరాబాద్‌: అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్‌ భౌతికకాయానికి మారేడుపల్లిలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, సినీ నటుడు బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.