Tuesday, 24 November 2026

హైదరాబాద్

చంద్రబాబును కలుసుకుంటున్న నేతలు

విశాఖ, జనంసాక్షి: రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న తెదేపా నేతలు పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కలుసుకుంటున్నారు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నరసింహులు, దేవినేని ఉమామహేశ్వరరావు, కోడెల శివప్రసాదరావు చంద్రబాబును కలుసుకున్న వారిలో ఉన్నారు.

ఏసీబీకి చిక్కిన మాచర్ల సీఐ ధర్మేంద్రబాబు

మాచర్ల , జనంసాక్షి: గుంటూరు జిల్లా మాచర్ల సీఐ ధర్మేంద్రబాబు ఏసీబీకి చిక్కారు. ఓ కేపుకు సంబందించి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సీఐని పట్టుకున్నారు.

తెరాస ఆవిర్భావ సభకు ముస్తాబైన ఆర్మూర్‌

నిజామాబాద్‌, జనంసాక్షి: తెరాస ఆవిర్భావ సభకు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. సభకు భారీ వేదికను సిధ్దం చేశారు. సుమారు 45 ఎకరాల ప్రాంగణంలో ,2లక్షల చదరపు అడుగుల విస్తీర్ణ్లంలో ప్రతినిధులు కూర్చోవడానికి…

పసుపుమయమైన విశాఖ

విశాఖ, జనంసాక్షి: ‘వస్తున్నా… మీకోసం’ పాదయాత్ర ముగింపు సభకు హాజరయ్యేందుకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్న తెదేపా శ్రేణులు, అభిమానులతో విశాఖ నగరం రద్దీగా మారుతోంది. నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారులు పార్టీ తోరణాలతో పసుపుమయమయ్యాయి.…

విశాఖలో ట్రాఫిక్‌ ఆంక్షలు

విశాఖ, జనంసాక్షి: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా విశాఖలో ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ బి. శివధర్‌రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం2 గంటల రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు.…

వైద్యుల నిర్లక్ష్యంవల్ల మృతి చెందిన బాలింత

కరీంనగర్‌, జనంసాక్షి: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఓ బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే బాలింత మృతికి కారణమని ఆసుపత్రి ఎదుట మృతిదేహంతో బంధువులు ధర్నాకు దిగారు. ఘటనాస్థలికి వచ్చిన ఆర్డీవోతో వాగ్వాదానికి దిగారు.

సమ్మెకు దిగిన రుయా ఆసుపత్రి ఉద్యోగులు

తిరుపతి, జనంసాక్షి: రుయా ఆసుపత్రిలో నాలుగో తరగతి ఉద్యోగులు సమ్మెకు దిగారు. ప్రధాన భవనానికి తాళం వేసి నిరసన చేపట్టారు. పని భారం తగ్గించాలని 13 రోజులుగా ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.

కోమాలోకెళ్లిన సరబ్‌జిత్‌సింగ్‌

ఇస్లామాబాద్‌, జనంసాక్షి: తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడ్డ భారత్‌వాసి సరబ్‌జిత్‌సింగ్‌ పరిస్థితి విషమంగా ఉంది. పాకిస్థాన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న సరబ్‌జిత్‌ సింగ్‌పై కోట్‌ లక్‌ పత్‌ జైల్లో నిన్న ఖైదీలు దాడికి దిగడంతో అతని తలకు తీవ్రగాయమైంది.అతన్ని…

ఛత్తీస్‌గఢ్‌ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసుల మృతి

రాయ్‌పూర్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాంకేర్‌ జిల్లా టడోకిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చొటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందారు, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

విశాఖ బహిరంగ సభకు తరలివెళ్తున్న తెదేపా కార్యకర్తలు

విశాఖ, జనంసాక్షి: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర నేడు విశాఖలో ముగియనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సభలో పాల్గొనేందుకు భారీగా తెదేపా కార్యకర్తల కోసం విశాఖకు ప్రత్యేకంగా 11 రైళ్లు ఏర్పాటు చేసినట్లు…