Sunday, 22 November 2026

హైదరాబాద్

సిగ్నల్స్‌ అందక నిలిచిన ‘బాద్‌షా’ సినిమా

ఆగ్రహంతో ఫర్నీచర్‌ ధ్వంసం చేసిన అభిమానులు ఉప్పల్‌, జనంసాక్షి: సినిమా  మధ్యలో నిలిచిపోయిందని ఆగ్రహించిన ప్రేక్షకులు ఉప్పల్‌లోని శ్రీకృష్ణ థియేటర్‌లోని అద్దాలు, ఇతర  ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. గురువారం శ్రీకృష్ణ థియేటర్‌లో ‘బాద్‌షా’ చిత్రప్రదర్శన జరుగుతోంది. సాయంత్రం ఆరుగంటల…

పట్టాలు తప్పిన యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌

ముగ్గురు మృతి..30మందికి గాయాలు చెన్నయ్‌, ఏప్రిల్‌ 10 (ఎపిఇఎంఎస్‌): ముజాఫర్‌పూర్‌-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. తమిళనాడు రాష్ట్రంలోని అరక్కోణం సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. రాయవేలూరు జిల్లా సిట్టేరి గ్రామం సమీపంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు…

సెబీ ఎదుట హజరైన సుబ్రతారాయ్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: డిపాజిట్లు సేకరించిన కేసులో సెబీ ఎదుట సహారా గ్రూపు సంస్థల చైర్మన్‌ సుబ్రతారాయ్‌ ఇవాళ హాజరయ్యారు. సుబ్రతారాయ్‌తో పాటు మరో ముగ్గురు ఎగ్జిక్యూటివ్స్‌ అధికారులు సెబీ ఎదుట హాజరయ్యారు.

ఎంబీబీఎస్‌ పార్టు-1 ఫలితాలు విడుదల

విజయవాడ, జనంసాక్షి: చివరి ఏడాది ఎంబీబీఎస్‌ పార్టు-1 ఫలితాలను విడుదల చేసినట్లు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఫలితాల కోసం http://ntruhs.ap.nic.in/వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

ఢిల్లీలో రక్షణ కరువైందన్న బెంగాల్‌ సీఎం మమత

ఢిల్లీ, జనంసాక్షి:  ఢిల్లీలో రక్షణ కరువైందని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల దాడికి గురైన మమత ఇవాళ చిదంబరంతో భేటీ రద్దు చేసుకుని ప్రత్యేక విమానంలో కోల్‌కతా బయల్దేరారు. మమత తోపాటు…

శాసనసభలో ముగిసిన ప్రజా పద్దుల సంఘం భేటీ

హైదరాబాద్‌, జనంసాక్షి: శాసనసభ కమిటీ హాలులో ప్రజా పద్దుల సంఘం సమావేశం ముగిసింది. ఈ భేటీలో 1,16,63 ఖాతాలకు చెందిన రూ. 23,43 కోట్లకు సరైన లెక్క లేకపోవడంపై పీఏసీ సభ్యులు అగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత డిపాజిట్‌…

మలేషియా ఎన్నికలు మే 5న

కౌలాలంపూర్‌, జనంసాక్షి: మలేషియాలో సాధారణ ఎన్నికలు మే 5న నిర్వహించనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

యూపీలో బాలిక నిర్భందంపై సుప్రీం ఆగ్రహం

లక్నో, ఉత్తరప్రదేశ్‌లో పదేళ్ల బాలికను పోలీసులు నిర్భందించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికను పోలీసులు నిర్భదించడాన్ని సుప్రీంకోర్టు సుమోటగా స్వీకరించింది. ఈ కేసు విషయంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై సోమవారంలోగా…

శ్రాగ్విని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

హైదరాబాద్‌, జనంసాక్షి:  నాలుగురోజుల క్రితం అపహరణకు గురైన చిన్నారి శ్రాగ్విని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారి ఆచూకి కనుగొన్న పోలీసులు పాపను మీడియా ముందుకు తీసుకువచ్చారు. చిన్నారిని కిడ్నాప్‌ చేసిన రావుల కృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ అనురాగ్‌శర్మ…

వరంగల్‌ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం

వరంగల్‌, జనంసాక్షి:  జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం వెలుగు చూసింది, ఎక్సైజ్‌ శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్న సుధాకర్‌ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి రూ. 9 లక్షల విలువైన 25 ద్విచక్రవాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.