Sunday, 22 November 2026

హైదరాబాద్

లోకాయుక్తాలో హీరో నాగార్జునపై ఫిర్యాదు

హైదరాబాద్‌, జనంసాక్షి: హీరో నాగార్జునపై మాదాపూర్‌లోని తమ్మిడి చెరువును కబ్జాచేసి ఎన్‌కన్వెన్షన్‌ కట్టారని జనంకోసం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీంతో లోకాయుక్తా జీహెచ్‌ఎంసీ, ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌, తహశీల్ధార్‌తో సహా…

ఏసీబీ వలలో చిక్కిన మాక్లూర్‌ ఎస్సై

నిజామాబాద్‌,  జనంసాక్షి: మాక్లూర్‌ ఎస్సై శేఖర్‌ ఓ కేసుకు సంబధించిన ఓ వ్యక్తి నుంచి రూ. 10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఎస్సైపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ఈతకు వెళ్లి ఆరుగురు గల్లంతు

ఖమ్మం, జిల్లాలోని కూనవరంలోని గోదావరి- శబరి సంగమం దగ్గర నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన ఆరుగురిలో నలుగురిలో స్థానికులు కాపాడగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

ఆరేళ్ల పిల్లాడ్ని కాల్చిన నాలుగేళ్ల బుడతడు!

న్యూజెర్సిలో ఘటన వాషింగ్టన్‌ :ఇంటి బయట ఆడుకుంటున్న ఆరేళ్ల బాలున్ని పొరుగింట్లో ఉండే నాలుగేళ్ల చిన్నారి తుపాకీతో కాల్చిన ఘటన న్యూజెర్సిలో చోటుచేసుకుంది. సొమవారం సాయంత్రం ఈ ఘటనలో బాలుడు గాయలతో బయటపడ్డాడు.దీనికి సంబంధించి పోలీసులు చిన్నారుల వివరాలను…

ఆధార్‌ కేంద్రం వద్ద తొక్కిసలాట: ఒకరు మృతి

గుంటూరు, జనంసాక్షి: జిల్లాలోని దాచేపల్లి మండలంలోని నారాయణపురంలోని ఆధార్‌ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో గురజాలకు చెందిన బొమ్మ నరసింహం అనే వ్యక్తి మృతి చెందగా పలువురికి గాయలయ్యాయి. ఈ ఘటనపై ప్రజలు అధికారులపై ఆగ్రహం…

హతాఫ్‌-4 అణు క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్‌

ఇస్లామాబాద్‌, జనంసాక్షి: హతాఫ్‌-4అణు క్షిపణిని పాకిస్థాన్‌ విజయవంతంగా పరీక్షించింది. దీనికి 900 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం ఉందని పాక్‌ రక్షణశాఖ అధికారులు తెలిపారు.

– సినీ నటి అంజలి అదృశ్యం

– పోలీసులకు సోదరుడి ఫిర్యాదు – ఐదు రోజుల క్రితం షూటింగ్‌ కోసం చెన్నై నుంచి హైదరాబాద్‌కు – దస్‌పల్లా హోటల్లో బస.. – మా పిన్ని మంచిదే – అసలేం జరిగిందో అర్థం కావట్లేదు – మరో…

మాదకద్రవ్యలు సేవించి యువతి వీరంగం

హైదరాబాద్‌, జనంసాక్షి: బంజారాహిల్స్‌లో ముంబయికి చెందిన అయేషా అనే యువతి మాదకద్రవ్యాలు సేవించి వీరంగం సృష్టించింది. రోడ్డుపైన వెళుతున్న జనంపైకి రాళ్లు విసిరి నానా హంగామా  చేసింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని…

నేటి నుంచి రష్యాలో షిండే పర్యటన

న్యూఢిల్లీ, జనంసాక్షి: కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే నేటి నుంచి మూడు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. సీమాంతర ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విపత్తుల నిర్వహణ తదితర అంశాలపై రష్యా మంత్రులతో ఆయన చర్చించనున్నారు.

ప్రేమ జంట ఆత్మహత్య

ఆదిలాబాద్‌, జనంసాక్షి: జిల్లాలోని బెల్లంపల్లి మండలం కన్నాల వద్ద గుర్తు తెలియని యువతి, యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.