Thursday, 19 November 2026

హైదరాబాద్

మహారాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం

ముంబాయి : మహారాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగో అంతస్తులో మంటలు చెలరేగి ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గత సంవత్సరం సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటనలో…

పనిచేసేవారికి గుర్తింపు లేదు : డీఎల్‌

కడప : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిపై ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి మరోసారి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీలో పనిచేసేవారిని ముఖ్యమంత్రిని గుర్తించటం లేదని ఆయన శనివారమిక్కడ ఆరోపించారు. ఈ సారి జిల్లాకు ఎమ్మెల్సీ స్థానం దక్కే…

ఆధార్‌కు తుది గడువు జూన్‌ 30

జనంసాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ జూన్‌ 30 లోగా ఆధార్‌ కార్డుల కోసం తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కావాల్సిన కసరత్తు పూర్తి చేస్తున్నట్లు ఆధార్‌ రీజినల్‌ డెప్యూటీ డెరైక్టర్‌ ఎంవీఎస్‌…

ఓపెన్‌ ఎయిర్‌ జైల్లో జైలు అధికారులు తనిఖీలు

నెల్లూరు : జిల్లాలోని ఓపెన్‌ ఎయిర్‌ జైల్లో జైలు అధికారులు తనిఖీలు నిర్వహించారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న నలుగురు ఖైదీల నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు జైలు అధికారులు తెలిపారు.

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షునిగా మాడ్యురో ప్రమాణం

కారకన్‌ : వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ అనారోగ్యంతో మృతి చెందడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా నికోలన్‌ మాడ్యురో బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న మాడ్యురోను తన రాజకీయ వారసునిగా చావెజ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు మాడ్యురో తాత్కాలిక…

ముఖ్యమంత్రిని కలిసిన పీసీసీ అధ్యక్షుడు బొత్స

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం ఉదయం ఏపీ భవన్‌లో కలిశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌తో కిరణ్‌, బొత్స సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ తుది జాబితాను…

అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక లారీల పట్టివేత

అమరావతి : గుంటూరు జిల్లా అమరవాతి మండలంలోని పొందుగల, మల్లాడి గ్రామాల ఇసుక రేవులపై ఈ తెల్లవారుజామున పోలీసుల దాడులు నిర్వాహించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలను సీజ్‌ చేశారు. వాహనాలను పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ…

అధికారుల తనిఖీలో 30 లారీల సీజ్‌

హైదరాబాద్‌ : విజయవాడ, కరీంనగర్‌, వరంగల్‌, రహదారుపై రవాణాశాఖ అధికారులు ఈ ఉదయం తనిఖీలు చేపట్టారు. అధిక లోడ్‌తో వెళ్తున్న 30 లారీలను సీజ్‌ చేశారు. వాహనాల యజమానులకు జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.

పాకిస్థాన్‌ ప్రధాని రజా పర్వేజ్‌ అఫ్రాఫ్‌ పర్యటనను బహిష్కరించిన అజ్మీర్‌ దర్గా గురువు

అజ్మీర్‌ : పాకిస్థాన్‌ ప్రధాని రజా పర్వేజ్‌ అఫ్రాఫ్‌ నేడు భారత పర్యటనకు రానున్నారు. రాజస్థాన్‌లోని ప్రముఖ అజ్యీర్‌ దర్గా దర్శించుకోనున్నారు. మరోవైపు పాక్‌ ప్రధాని పర్యటనను బహిష్కరిస్తునట్లు అజ్మీర్‌ దర్గా ఆధాత్మిక గురువు జైనుల్‌ అబేదిన్‌ తెలిపారు.…

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకే మద్దతు

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకే మద్దతిస్తామని నాగం జనార్థన్‌రెడ్డి తెలిపారు. పోలవరం టెండర్లు వెంటనే రద్దు చేసి సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.