Thursday, 19 November 2026

హైదరాబాద్

భద్రతా దళాల అకృత్యాలపై కన్నీరు పెట్టిన ఒమర

శ్రీనగర్‌ : సెక్యూరిటీ దళాల ఆకృత్యాలపై కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కన్నీరు పెట్టారు. ఉత్తర కాశ్మీర్‌, బారాముల్లాలో సెక్యూరిటీ దళాల కాల్పుల్లో ఒకరు మరణించగా నలుగురు గాయపడిన సంఘటనపై మంగళవారం అసెంబ్లీలో విపక్షాలు నిలదీశాయి. దీంతో ఆయన…

భారత్‌ – పాకిస్థాన్‌ స్నూకర్‌ సిరీన్‌ వాయిదా

ఇస్లామాబాద్‌: భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య జరగాల్సిన స్నూకర్‌ సీరిస్‌ వాయిదా పడింది. కరాచీలో భద్రతా కారణాల రీత్యా ఈ సిరిస్‌ వాయిదా వేస్తున్నామని, ఎప్పుడు జరపబోయేదీ త్వరలో చెప్పామని పాకిస్థాన్‌ బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అలంగిర్‌…

శివస్వాములను అడ్డుకున్న ఆలయ సిబ్బంది

అల్లంపూర్‌: మనపాడు మండలం ఉండవల్లి గ్రామంలోని వెంకటేశ్యర స్వామి ఆలయంలోకి శివస్వాములు ప్రవేశించకుండా ఆలయ సిబ్బంది అడ్డగించారు. దీంతో శివస్వాములు ఆలయం ముందు ఆందోళన చేశారు.

మేఘాలయ సీఎంగా ముకుల్‌ సంగ్మా ప్రమాణస్వీకారం

షిల్లాంగ్‌ : మేఘాలయ 23వ ముఖ్యమంత్రిగా ముకుల్‌ సంగ్మా నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయన వరసగా రెండోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ మూషాహరి ముకుల్‌ సంగ్మాచేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ వారాంతంలో…

మక్మూల్‌కు రిమాండ్‌ : తీహార్‌ జైలుకు తరలింపు

న్యూఢిల్లీ : ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది మక్బూల్‌ను ఎన్‌ఐఏ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి ఈ నెల 13 వరకు జుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దాంతో మక్బూల్‌ను తీహార్‌ జైలుకు తరలించారు. మక్బూల్‌పై గతంలో దాఖలైన కేసులకు…

లోక్‌సభ రేపటికి వాయిదా

ఢిల్లీ : లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలవరకు వాయిదా పడింది. ఉత్తరప్రదేశ్‌లో డీఎస్పీ హత్య వ్యవహారంపై సభ్యుల ఆందోళన ఈరోజు ఉదయం నుంచి సభా వ్యవహారాలకు ఆటంకం కలిగిస్తూ వచ్చింది.  దాంతో సభాపతి…

పాల్వంచ మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలు

పాల్వంచ : ఖమ్మం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు నిర్వహించింది. రూ. కోటిన్నరతో నిర్మించిన నూతన భవన నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాలపై ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ బాపురెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. పలు…

ఏసీబీ వలలో ఖాదీ ఉద్యోగి

ఆదిలాబాద్‌: ఏసీబీ వలకు ఖాదీ శాఖ అధికారి చిక్కారు. ఖాదీ గ్రామోద్యోగి డైరెక్టర్‌ మరియప్ప ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 22 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అధికారిపై కేసు నమోదు చేసినట్లు…

పంట రుణాల మాఫీపై పార్లమెంట్‌కు కాగ్‌ నివేదిక

న్యూఢిల్లీ : పంట రుణాలపై పార్లమెంట్‌కు కాగ్‌ నివేదికను సమర్పించింది. పంట రుణాల మాఫీ విషయంలో అధికారులు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని నివేదికలో కాగ్‌ పేర్కొంది. అర్హులైన లబ్ధిదారులకు రుణాల మాఫీ వర్తించలేదని వెల్లడించింది.

పెట్రోల్‌ ధరల పెంపుపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ : పెట్రోలు ధరల పెంపుపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ధరల పెంపుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు…