Thursday, 19 November 2026

హైదరాబాద్

ఎమ్మెల్సీ ఎన్నికలను నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: శాసనభ్యులు ఎన్నుకునే 10 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 11 వరకూ నామినేషన్లను స్వీకరించనున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ పదవుల కోసం అధికార పార్టీ కాంగ్రెస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షం తెదేపాలో కూడా…

ప్రయాణ ప్రాంగణాల్లో పటిష్ఠ భద్రత

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణ ప్రాంగణాల్లో భద్రతను మరింత పటిష్ఠ పరచాలని ఆర్టీసీ నిర్ణయించింది. మూడు రోజుల క్రితం నగరంలోని ఎంజీబీఎన్‌ పరిసరాల్లో పేలుడుకు వినియోగించే వస్తువులు లభ్యమవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎంజీబీఎన్‌తోపాటు నిత్యం…

ఢిల్లీకి మక్బూల్‌, ఇమ్రాన్‌ల తరలింపు

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో విచారణ నిమిత్తం తీహార్‌ జైలు నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చిన మక్బూల్‌, ఇమ్రాన్‌లను ఈ ఉదయం ఢిల్లీకి తరలించారు. అంతకుముందు వీరిని భారీ భద్రత మధ్య శంషాబాద్‌ విమానశ్రయానికి తీసుకువచ్చారు. ఎన్‌ఐఏ కార్యాలయంలో…

పేలుళ్ల కేసులో మరో అనుమానితుడి అరెస్టు

రాంచీ : హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి మరో అనుమానితున్ని జార్ఖండ్‌ రాజధాని రాంచీలో పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. మంజరి ఇమామ్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని…

ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరి మీతి

విశాఖ: సీలేరు వద్ద ఈ ఉదయం ఓ ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సీలేరు ఆసుపత్రికి తరలించారు.

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 35 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 18 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

పాఠశాల బస్సు – ట్రక్కు ఢీ… 11 మంది విద్యార్థుల మృతి

జలంధర్‌ : పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌ జిల్లాలోని గహీర్‌ గ్రామంలో ఈ  ఉదయం అకాల్‌ అకాడమీ పాఠశాల బస్సు ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో 11 మంది విద్యార్థులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జలంధర్‌…

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస

ఢాకా: బంగ్లాదేశ్‌లో హింస కొనసాగుతోంది. జమాతే ఇస్లామీ నేత దిలావర్‌ హుస్సేన్‌ సయ్యదీకి మరణ శిక్ష విధింపుతో చేలరేగిన అల్లర్లలో ఇప్పిటివరకూ 76 మంది మృతి చెందారు. ఘర్షణల్లో ఆదివారం ఒక్క రోజే 21 మంది చనిపోవడంతో సమస్యాత్మక…

ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసగించిన విశ్రాంతి ఉద్యోగి అరెస్టు

పెద్దాపురం : ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యువకులను మోసగించిన కేసులో విశ్రాంతి మైక్రో ఇరిగేషన్‌ పిడీ సవరపు వేణుగోపాల్‌రావును తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేణుగోపాలరావు పెద్దాపురం, అమలాపురం, కాకినాడకు చెందిన 20 మంది నుంచి సుమారు…

ప్రణబ్‌తో బంగ్లాదేశ్‌ విపక్ష నేత భేటీ రద్దు

ఢాకా : భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పర్యటన బంగ్లాదేశ్‌లో నిన్న ప్రారంభమైంది. జమాతే ఇస్లామీ నేతకు ఉరిశిక్ష విధింపుతో బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేత బేగమ్‌ ఖలేదా జియా ప్రణబ్‌ముఖర్జీతో భేటిని రద్దు…