Thursday, 19 November 2026

హైదరాబాద్

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 17 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను కోల్పోయింది. సెహ్వాగ్‌ (6) సిడిల్‌ బౌలింగ్‌లో వాడేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ప్రస్తుతం పుజారా, విజయ్‌ క్రీజ్‌లో ఉన్నారు. వికెట్లేమి…

పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌: ఇప్లూలో ఆంగ్ల పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాశ్మీర్‌కు చెందిన ముదేసిన్‌ కమరన్‌ పీహెచ్‌డీ రెండో సంవత్సరం చేస్తున్నాడు. స్నేహితుడితో తలెత్తిన వివాదం పోలీసు కేసుకు దారితీయడంతో మనస్తాపానికి గురైన ముదేసిర్‌ నిన్న అర్థరాత్రి తన గదిలో…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మెడ్జిల్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా మెడ్జిల్‌ మండలంలోని రాణిపేట వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢికొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. యువకుల ముఖాలపై నుంచి లారీ వెళ్లడంతో మృతదేహాలు గుర్తిపట్టడానికి వీళ్లేకుండా మారాయి. పోలీసులు కేసు నమోదు…

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీ శైల క్షేత్రం ముస్తాబైంది. ఈ ఉదయం బ్రహ్మోత్సవాలకు శ్రీశైల గిరులపై అంకురార్పణ పూజలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు 13వ తేదీ వరకు జరుగుతాయి. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 10 లక్షల…

లారీ బోల్తా ఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని హిమాయత్‌సాగర్‌ వద్ద ఔటర్‌రింగ్‌రోడ్డుపై  నుంచి ఇటుక లారీ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పోందుతూ…

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ఆత్రేయపురం : తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని వెలిచేరు వద్ద ఈ ఉదయం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. గడ్డి లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా పెనేగొండ మండలం…

నేటి నుంచి రాష్ట్రపతి తొలి విదేశీ పర్యలన

న్యూఢిల్లీ : రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రణబ్‌ముఖర్జీ విదేశీ పర్యటన చేపడుతున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రపతి బంగ్లాదేశ్‌లో  పర్యటించనున్నారు. ఈ పర్యటనలో బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు జిల్లూర్‌ రహ్మాన్‌, ప్రధాని షేక్‌ హసీనా, విపక్షనేత…

దూరదర్శన్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ : సెంట్రల్‌ ఢిల్లీలోని మండిహౌస్‌ ప్రాంతంలోని దూరదర్శన్‌ కార్యాలయంలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయంలోని ఐదో  అంతస్తులో మంటలు చెలరేగి భారీగా ఎగసిపడ్డాయి. 22 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి…

6నుంచి క్రీడా వేడుకలు

హైదరాబాద్‌: కస్తూరిబాగాంథీ బాలికా విద్యాలయాల (కె.జి.బి.వి.వి) రాష్ట్రస్థాయి క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు ఈనెల 6 నుంచి  8 వరకు హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో సుమారు రెండువేల మంది విద్యార్థినులు పాల్గొంటారని రాజీవ్‌ విద్యా మిషన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌…

పత్తిమిల్లులో అగ్నిప్రమాదం

కరీంనగర్‌: మానకొండూరు మండలం చేజర్లలోని పత్తిమిల్లులో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 450 క్వింటాళ్ల పత్తి దగ్థమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.