Thursday, 19 November 2026

హైదరాబాద్

పోలవరం టెండర్లపై ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయం

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు టెండర్ల ఖరారుపై ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు టెండర్లను ఖరారు చేయాలని కమిటీ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి కమిటీ ఈ మేరకు సిఫార్సు చేయనుంది.

తితిదే పాలకమండలి సమావేశం ప్రారంభం

తిరుమల : అన్నమయ్య భవన్‌లో తితిదే పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో సుమారు రూ. 2,500 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి తితిదే ఇంజినీరింగ్‌ విభాగానికి అధికమొత్తంలో నిధులు కేటాయించనున్నారు. 65 ఏళ్లకు అర్చకుల…

మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా కేసులకు త్వరగా పరిష్కారం : న్యాయమూర్తి అల్తమన్‌ కబీర్‌

హైదరాబాద్‌: కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమన్‌ కబీర్‌ అన్నారు. సిటీ సివిల్‌ కోర్టులో ఆయన మధ్యవర్తిత్వం కేంద్రాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ముఖ్యమంత్రితో కలిసి…

ఉగ్రవాదుల దాడులను ఆరికట్టడంలో ప్రధాని విఫలం : భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌

న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదుల దాడులు పేట్రేగిపోతున్న చర్యలు తీసుకోవడంతో ప్రధాని విఫలమయ్యారని భాజపా అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు.హైదరాబాద్‌, ముంబయిలో ఉగ్రవాదుల దాడులపై కేంద్రం నిఘా కొరవడిందని మండిపడ్డారు.…

మిలిటెంట్ల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి

శ్రీనగర్‌: ఉత్తర కాశ్మీర్‌లోని హన్‌ద్వారాలో మిలిటెంట్లు తెగబడ్డారు. తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాకినాడ స్టేడియం రోడ్డులో సీఎన్‌జీ పైపులైన్‌ లీకేజీ

కాకినడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ స్టేడియం రోడ్డులో సీఎన్‌జీ పైపులైన్‌ నుంచి గ్యాస్‌ లీకవుతోంది. గ్యాస్‌ భారీగా  బయటకు వస్తుండటంతో భయంతో స్థానాకులు పరుగులు తీశారు. పైపులైన్‌ పనులు చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్‌  బయటకు వచ్చిందని కార్మికులు…

పాలమూరు డీఆర్సీ మీటింగ్‌లో జూపల్లి నిరసన

మహబూబ్‌నగర్‌ : జిల్లా డీఆర్సీ మీటింగ్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే  జూపల్లి కృష్ణారావు నిరసన వ్యక్తం చేశారు. డీఆర్సీ సమావేశానికి అధికారులు మీడియాను అనుమతించక పోవడంతో ఆయన సమావేశంలోనే బైటాయించి ధర్నా చేశారు. దీంతో సమావేశంలో ఉధ్రిక్తత ఏర్పడింది.

జగిత్యాలలో ప్రైవేట్‌ ఆస్పత్రులు బంద్‌

కరీంనగర్‌ : ప్రైవేట్‌ ఆస్పత్రులపై దాడులకు పాల్పడుతున్నారని నిరసన వ్యక్తం చేస్తూ వ్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు పట్టణంలో బంద్‌ను పాటిస్తున్నాయి. గత మూడు రోజులుగా ఆస్పత్రులను మూసివేసి నిరసన తెలుపుతున్నారు. దీంతో స్థానికంగా ఉన్న రోగులు, అకస్మాత్తుగా అస్వస్థతకు…

మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని సివిల్‌కోర్టు ఆరవణలో ఏర్పాటు చేసి మధ్యవర్తిత్వ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ అల్తమన్‌ కబీర్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలనుకునే వారికి…

రెండు గూడ్స్‌ రైళ్లు ఢీ.. పట్టాలు తప్పిన వ్యాగన్లు

హైదరాబాద్‌: మౌలాలి వద్ద రెండు గూడ్స్‌ రైళ్లు వెనుకనుంచి ఢీకొన్నియి. దీంతో రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. సరకులు లోడ్‌ చేస్తుండగా లింకు తెగి రెండు రైళ్ల వ్యాగన్లు  వెనక నుంచి ఢికొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే…