Wednesday, 18 November 2026

హైదరాబాద్

టెలికాంపై మంత్రుల సాధికారిక బృందం భేటీ నేడు

న్యూఢిల్లీ : టెలికాంపై ఏర్పాటైన మంత్రుల సాధికారిక బృందం నేడు భేటీ కానుంది ఆర్ధిక మంత్రి చిదంబరం అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రుల బృందం స్పెక్ట్రం వేలంలో ఎన్ని బ్లాక్‌లకు బిడ్డింగ్‌ వేయాలనే అంశంపై చర్చించనుంది.

మెక్సికోలోని చమురు కంపెనీ కార్యాలయంలో భారీ పేలుడు : 14 మంది మృతి

మెక్సికో సిటీ : మెక్సికోలోని పీమెక్స్‌ చమురు కర్మాగారం ప్రధాన కార్యాలయంలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. 80 మందికిపైగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న సహాయకసిబ్బంది హెలికాప్టర్లు, అంబులెన్స్‌ల సహాయంతో…

చిలీలో భూకంపం

శాంటియాగో : ఉత్తర చిలీలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై ప్రకంపనల తీవ్రత 6.7గా నమోదైంది. కోపియాపోకు 63 మైళ్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారున. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదని, భూకంపం దాటికి విద్యుత్‌, సమాచార…

ఎట్టకేలకు లోక్‌పాల్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం

14 సవరణలు.. లోక్‌పాల్‌ పరిధిలోకి సీబీఐ న్యూఢిల్లీ, జనవరి 31 (జనంసాక్షి): ఎట్టకేలకు కొత్త లోక్‌పాల్‌ ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్‌ గురువారంనాడు ఆమోదం తెలిపింది. 14సవరణలతో ఈ బిల్లును కేబినెట్‌ ఆమోదించినట్టు సిఎంఓలో సహాయమంత్రి వి.నారాయణ స్వామి…

అమానవీయంగా శంకర్రావు అరెస్టు

తీవ్ర అస్వస్థత .. ఆస్పత్రికి తరలింపు హైదరాబాద్‌, జనవరి 31 (జనంసాక్షి) : మాజీ మంత్రి, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శంకర్రా వును పోలీసులు గురువారం అమానవీయంగా అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని గ్రీన్‌ఫీల్డ్‌ భూ ముల విషయంలో ఆయనను అరెస్టు…

ఆర్థిక సంస్కరణల ద్వారానే పేదరిక నిర్మూలన

ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ న్యూఢిల్లీ, జనవరి 31 (జనంసాక్షి) : ఆర్థిక సంస్కరణల అమలుతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమగ్రాభివృద్ధి సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకనుగుణంగా వృద్ధి…

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ప్రధానోపాధ్యాయురాలు

ప్రకాశం : ప్రకాశం జిల్లా రాచర్లలో గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు.వంట చేసే గుత్తేదారు నుంచి రూ. 20 వేల లంచం తీసుకుంటూ ఆమె ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.

12 మంది డీఎస్పీల బదిలీ

హైదరాబాద్‌: మరోసారి 12 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 12 మంది డీఎస్పీలను బదిలీ  చేస్తూ డీజీపీ దినేశ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్‌సీటీఈ లేఖలో అస్పష్టత

హైదరాబాద్‌: ఎన్‌జీటీ పోస్టుల్లో బీఈడీ అభ్యర్థులకు అవకాశంపై ఎన్‌సీటీఈ రాసిన లేఖ అస్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కేంద్రంతో సంప్రదించి నిర్ణయం  తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత నిర్ణయం ప్రకారం ఎన్‌జీటీపోస్టులకు డీఈడీ అభ్యర్థులే అర్హులని…

ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

ఢిల్లీ : ఈరోజు ఢిల్లీ హైకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రులు సైతం అత్యాచార బాధితురాలికి తక్షణ చికిత్స అందించే విధంగా, మెడికో లీగల్‌ కేసు నెపంతో నిరాకరించడం కుదరదని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేయాల్సిందిగా రాష్ట్రప్రభుత్వానికి,…