Wednesday, 11 November 2026

వరంగల్

మావోయిస్టుల బంద్‌: బస్సుల రద్దు

 : వరంగల్‌ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మూడు జిల్లాల బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో మావోయిస్టుల బంద్‌ కొనసాగుతోంది. దీంతో ముందు జాగ్రత్తగా టీఎస్‌ఆర్టీసీ ఏజెన్సీ గ్రామాలకు బస్సుల రాకపోకలను నిలిపివేసింది.

పిచ్చికుక్క కాటుకు గాయపడ్డ ఎనిమిది మంది

మరిపెడ (వరంగల్‌జిల్లా), సెప్టెంబరు 13 : జిల్లాలోని మరిపెడలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. జయారం గ్రామంలో పిచ్చికుక్క కాటుకు 8 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో వృద్ధులు కూడా ఉన్నారు. గతంలో…

మహబూబాబాద్‌లో పీఎస్ భవనం ప్రారంభం

వరంగల్, సెప్టెంబర్ 9 : జిల్లాలోని మహబూబాబాద్‌లో పోలీస్‌ స్టేషన్‌ భవనాన్ని ప్రారంభించిన మంత్రులు నాయిని , కడియం శ్రీహరి బుధవారం ప్రారంభించారు. కాగా మానకోటను జిల్లాగా ప్రకటించాలని పీఎస్‌ బయట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పోలీస్‌స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు…

మహబూబాబాద్‌లో కొనసాగుతున్న బంద్

వరంగల్, సెప్టెంబర్ 9 : మహబూబాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ అఖిలపక్షం పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యాపార సంస్థలు, హోటళ్లు, మూతపడ్డాయి. ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా సీపీఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. మరోవైపు మహబూబాబాద్‌లో…

మణుగురు రైలులో సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అదృశ్యం

వరంగల్‌, సెప్టెంబరు 9 : సికింద్రాబాద్‌-మణుగూరు రైలులో తమిళనాడుకు చెందిన సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ గణపతి అదృశ్యమయ్యాడు. కాజీపేటలో గణపతి తప్పిపోయినట్లు తోటి కానిస్టేబుళ్లు గుర్తించారు. ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో పనిచేస్తున్న గణపతి అదృశ్యంపై డోర్నకల్‌ పోలీసులకు ఫిర్యాదు…

పెళ్లి పేరుతో విద్యార్థిని లొంగదీసుకున్న టీచర్‌

వరంగల్‌, సెప్టెంబరు 8 : జిల్లాలోని తొర్రూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు పెళ్లి పేరుతో విద్యార్థినిని లొంగదీసుకున్నాడు. దీంతో ఆ విద్యార్థిని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆపై పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలైన విద్యార్థిని టీచర్‌పై…

వరంగల్ జిల్లాలో పిచ్చికుక్కల స్వైర విహారం

వరంగల్ జిల్లాలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. హన్మకొండ ప్రగతినగర్ లో కుక్కలు స్థానికులపై దాడి చేశాయి. పిచ్చి కుక్కల దాడిలో ఆరుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. చిన్నారుల తల్లిదండ్రులు…

కుమార్తెతో కలిసి తల్లి ఆత్మహత్య యత్నం

వరంగల్‌, సెప్టెంబరు 7 : స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం నెమిలిగొండలో కుమార్తెతో కలిసి తల్లి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ సంఘటనలో తల్లీకూతుళ్ల పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

బైక్ ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్..

వరంగల్: జిల్లా నర్సింహులపేట మండలం కుమ్మరికుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

వరంగల్ : నెక్కొండ మండలం శంభునికుంటలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలో ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు.