Saturday, 21 November 2026

జాతీయం

దేశ సమగ్రతకు విఘాతం కల్గిస్తే ఊరుకోం గులాంనబీ ఆజాద్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 (జనంసాక్షి): గత రాత్రి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరిగిన బాంబ్‌ పేలుళ్ల సంఘటన వెనుక ఎంత పెద్ద ఉగ్రవాదులున్నప్పటికి వదిలే ప్రసక్తేలేదని కేంద్ర మంత్రి గులాం నబీ అజాద్‌ హెచ్చరించారు. సంఘటనా స్థలాలను పరిశీలించిన…

నాగాలాండ్‌, మేఘాలయ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఈ ఉదయం ప్రారంభమైంది. పోలింగ్‌ సందర్భంగా రెండు రాష్ట్రాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాగాలాండ్‌లో 11.93 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 60…

యూపీఏ సమన్వయ కమిటీ భేటీ నేడు

న్యూఢిల్లీ: వచ్చేవారంలో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న  నేపథ్యంలో యూపీఏ సమన్వయ కమిటీ శనివారం భేటీ కానుంది. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌నివాసంలో జరిగే ఈ భేటీలో సోనియాగాంధీతో పాటు ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు.

నేడు నాగాలాండ్‌, మేఘాలయ ఎన్నికలు

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నేడు జరగనుంది. నాగాలాండ్‌లో శనివారం జరగునున్న 12వ శాసనసభ ఎన్నికల్లో 11.93 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 60 స్థానాలకు ఇద్దరు మహిళలు సహా…

సూట్‌కేసుల కలకలం

న్యూఢిల్లీ : ఏపీ భవన్‌, పార్లమెంటు భవనం మధ్యలో బాబూ రాజేంద్రప్రసాద్‌ రహదారిలో పడి ఉన్న రెండు సూట్‌కేసులు కలకలం సృష్టించాయి. బాంబ్‌ స్క్వాడ్‌ సిబ్బంది వీటిని తనిఖీ చేస్తున్నారు.

పేలుళ్లపై ముందుగానే హెచ్చరించాం : కేంద్ర హోంశాఖ

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌ ఉగ్రవాదుల నుంచి దాడుల  ప్రమాదం ఉందని, పేలుళ్లు జరగవచ్చని నిన్న ఉదయమే హైదరాబాద్‌ పోలీసులను అప్రమత్తం చేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. హైదరాబాద్‌, బెంగుళూరు. కోయంబత్తూరు, హుబ్లీలలో కూడా పోలీసులను హెచ్చరించినట్లు ప్రకటించింది.

సమాచారం అందించటమే కానీ కేంద్రం చర్యలు తీసుకోదా? : సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ : హైదరాబాద్‌ ఘటనపై షిండే ప్రకటన సాదాసీదాగా ఉందనిలోక్‌సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్‌ మండిపడ్డారు. మూడు రోజులల ముందే కేంద్రం సమాచారం అందించి ఉంటే ఆంధ్రప్రదేశ్‌ ఎందుకు అప్రమత్తం కాలేదని ఆమె ప్రశ్నించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి…

లోక్‌సభలో హైదరాబాద్‌ పేలుళ్ల ఘటనపై షిండే ప్రకటన

న్యూఢిల్లీ : రెండుసార్లు వాయిదా అనంతరర లోక్‌సభ తిరిగి ప్రారంభమైంది. హైదరాబాద్‌ పేలుళ్ల ఘటనపై కేంద్ర హోంమంత్రి షిండే లోక్‌సభలో ప్రకటించారు. నిన్న సాయంత్రం 6.58, 7.01 గంటలకు రద్దీగా ఉండే దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల…

ఇది అత్యంత విషాదకరమైన ఘటన : సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ : హైదరాబాద్‌ జంట పేలుళ్ల ఘటనను లోక్‌సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్‌ ఖండించారు. ఇది అత్యంత విషాదకరమైన ఘటనగా ఆమె పేర్కొన్నారు. లోక్‌సభలో జంట పేలుళ్ల ఘటనపై జరిగిన చర్చలో సుష్మాస్వరాజ్‌ మాట్లాడారు. దేశంలో ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు ఐక్యంగా…

పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్న షిండే

న్యూఢిల్లీ : హైదరాబాద్‌ జంట బాంబు పేలుళ్ల ఘటనపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో కేంద్ర హోంశాఖ మంత్రి షిండే మధ్యాహ్నం ప్రకటన చేయనున్నారు. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఈ ఘటనపై చర్చకు పట్టుబట్టి…