జాతీయం

స్పష్టమైన విజయం దిశగా కాంగ్రెస్‌

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో స్పష్టమైన విజయం దిశగా కాంగ్రెస్‌ దూసుకుపోతోంది. 37 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మరో 79 స్థానాల్లో …

శోభా కరంద్లాజె ఓటమి

బెంగళూరు : మాజీ మంత్రి, కేజేపీ అభ్యర్థి శోభా కరంద్లాజె అపజయం పాలయ్యారు. బెంగళూరు రాజాజీనగర నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు.

27 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం

బెంగళూరు : కర్ణాట విధాన సభ ఎన్నికల్లో సాధారణ మెజారిటీ దిశగా కాంగ్రెస్‌ దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ ఆ పార్టీ 27 స్థానాల్లో గెలుపొందింది. మరో 91 …

గాలి కరుణాకర్‌రెడ్డి ఓటమి

బెంగళూరు : భాజపా అభ్యర్థి గాలి కరుణాకర్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. దావణగెరె జిల్లా హర్పనహళ్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు.

కాంగ్రెస్‌ మెజార్టీ సాధిస్తుంది : మునియప్ప

బెంగళూరు : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పూర్తిస్థాయి మెజార్టీని సాధిస్తుందని కేంద్రమంత్రి మునియప్ప అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కేంద్రంలోని యూపీఏ ప్రవేశపెట్టిన పథకాలే పార్టీని గెలిపించాయని ఆయన …

ఆధిక్యంలో యడ్యూరప్ప

బెంగళూరు : మాజీ ముఖ్యమంత్రి, కేజీపీ అధ్యక్షుడు యడ్యూరప్ప శికారిపుర నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై 8,492 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు.

భాజపా అగ్రనాయకత్వం కొన్ని తప్పులు చేసింది

భాజపా ఎమ్మెల్సీ లెహర్‌సింగ్‌ బెంగళూరు : యడ్యూరప్ప అంశంలో భాజపా అగ్రనాయకత్వం కొన్ని తప్పులు చేయడంతో ఈ ఎన్నికల్లో నష్టపోవాల్సి వచ్చిందిని భాజపా ఎమ్మెల్యే లెహర్‌సింగ్‌ సిరొయా …

ఆట ముగిసింది : కమల్‌నాథ్‌

న్యూఢిల్లీ : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంతో ఆట ముగిసిందని కేంద్రమంత్రి కమల్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. భాజపా అసలు రంగును ప్రజలు గ్రహించి తిరస్కరించారని ఆయనన్నారు.

2 చోట్ల భాజపా గెలుపు

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో భాజపా రెండు స్థానాల్లో విజయం సాధించింది. మరో 37 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అధిక్యంలో కొనసాగుతున్నారు.

సీఎం ఎవరనేది అధిష్ఠానం నిర్ణయిస్తుంది : ఖార్గే

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనేదీ పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని కేంద్ర కార్మికమంత్రి మల్లికార్జునఖార్గే అన్నారు. అధిష్ఠానం సూచనల ప్రకారమే కాంగ్రెస్‌ శ్రేణులు నడుచుకొంటాయని ఆయన తెలిపారు.