Thursday, 12 November 2026

ఖమ్మం

వస్త్ర యజమానుల నిరవధిక దీక్షలు

అశ్వారావుపేట: వస్త్ర దుకాణాలపై ప్రభుత్వం విధించిన వ్యాట్‌కు నిరసనగా నిరవధిక బంద్‌ను చేపట్టిన యజమానులు నేటి నుంచి నిరవధిక దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు వామపక్షాలు, బీసీ ఐక్య వేదిక, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తదితర సంఘాలు మద్దతిచ్చాయి.

శివరాత్రి జాతర సందర్భంగా ఇద్దరు మృతి

ఖమ్మం గ్రామీణం: మండలంలోని తీర్థాల సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న జాతరలో ఇద్దరు మృతి చెందారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో రొయ్యల సాయిప్రకాష్‌ (12), వరంగల్‌ జిల్లా డోర్నకల్‌ మండలం తోడేళ్ల గూడెంకు చెందిన తోట నవీన్‌కుమార్‌…

పోటెత్తిన భక్తజనం

బూర్గంపాడు: మండలంలోని పురాతన ఆలయాలైన పెద్దరావిగూడెం కేదారేశ్యరస్వామి, మోతెగడ్డలోనివీరభద్రస్వామి ఆలయాల్లో శివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. గోదావరి నదీతీరం లోని ఈ రెండు శైవక్షేత్రాలు మహాశివరాత్రి జాతరకు ప్రసిద్ధి చెందాయి. తెల్లవారుజామునుంచే భక్తులు వచ్చి గోదావరి నదిలో స్నానాలు…

వ్యవసాయ కళాశాల విద్యార్థికి బంగారు పతకం

అశ్వారావుపేట: దేశ వ్యాప్తంగా అంతర్‌ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో కర్నాటక రాష్ట్రం బీదర్‌లో ఈ నెల 6నుంచి 10వ తేదీ వరకు జరిగిన క్రీడా పోటీల్లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాయానికి ఒక బంగారు పతకం, 3వెండి పతకాలు దక్కాయి.…

మంచినీటి కోసం మహిళల ఆందోళన

దమ్మపేట: మండలంలోని మందలపల్లి , ప్రకాశ్‌ నగర్‌ కాలనీలో మంచినీటి సమస్యపై మహిళలు రోడ్డెక్కారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు ఖాళీబిందెలతో ఆందోళనకు దిగారు. కాలనీలో గత రెండు నెలలుగా మంచి నీటి సరఫరా సక్రమంగా లేదని ఆవేదన…

మన్నేరువాగులో మనిగి ఇద్దరి మృతి

ఖమ్మం : ఖమ్మం గ్రామీణ మండలం తీర్థాల జాతరలో అపశ్రుతి చోటుచేసుకుంది. శివరాత్రి సందర్భంగా నిన్న రాత్రి జాగరణ చేసి మున్నేరువాగులో స్నానానికి దిగిన ఇద్దరు మృతి చెందారు. వాగు లోతుగా ఉండటం, ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతోనే…

రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభం

ఖమ్మం క్రీడలు: రాష్ట్ర స్థాయి ఆహ్వానిత క్రికెట్‌ పోటీలు శనివారం ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఏవీ రంఘనాధ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి టోర్నీని ప్రారంభించారు. సీఐ నరేష్‌రెడ్డి పర్యవేక్షణలో పోటీలు…

అశ్వారావుపేట వ్యాట్‌పై వస్త్ర దుకాణాలు బంద్‌

అశ్వారావుపేట: వస్త్ర దుకాణాలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అశ్వారావుపేటలో వస్త్ర దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ సందర్భంగా వస్త్ర దుకాణాల సంఘం ఆధ్వర్యంలో అశ్వారావుపేటలో ప్రదర్శన నిర్వహించారు. ఆ కార్యక్రమానికి వస్త్ర…

విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలని ధర్నా

అశ్వారావుపేట: పెంచిన విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో ఏడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆ పార్టీ జిల్లా నాయకులు ప్రభాకర్‌, కల్లయ్య నాయకత్వం వహించారు.

న్యాయం చేయాలంటూ యువతి ధర్నా

వేలేరుపాడు: ప్రేమించిన యువకుడితో తనకు పెళ్లి చేయాలంటూ గిరిజన యువతి స్థానిక ఠాణా ఎదుట ధర్నాకు దిగింది. మండలంలోని రామవరం గ్రామానికి చెందిన మడివి వనజ కన్నాయగుట్టకు చెందిన కుంజా సాగర్‌ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో…