Friday, 20 November 2026

రంగారెడ్డి

గుర్తు తెలియని మహిళ దారుణ హత్య

రంగారెడ్డి : జిల్లాలోని కుల్కచర్ల మండలం బండేలికిచర్ల గ్రామ సమీపంలో గుర్తు తెలియని మహిళను మతమార్చి దహనం చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తి దారుణ హత్య

రంగారెడ్డి : జిల్లాలోని ఘట్‌కేసర్‌ మండలం ఏదూలాబాద్‌ వద్ద గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి మృతి

రంగారెడ్డి (తాండూరు) : రంగారెడ్డి జిల్లా యేలాల మండలం పగిడ్యాల గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పగిడ్యాల గ్రామానికి చెందిన కొత్తకురువ రాములు వ్యక్తి మృతి చెందాడు.

ఎంజీఎం ఓపీ వద్ద ఆడశిశుును వదిలి వెళ్లిను గుర్తుతెలియని వ్యక్తులు

వరంగల్‌ : ఎంజీఎం ఆసుపత్రి ఔట్‌ పేషెంట్‌ విభాగం వద్ద 4 రోజుల ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు.శిశువును ఆసుపత్రి వర్గాలు స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారమిచ్చారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ముగ్గురు స్మగ్లర్లు అరెస్టు

రంగారెడ్డి : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ముగ్గురు స్మగ్లర్ల నుంచి మూడు కిలోల బంగారంతో పాటు నకిలీ పాస్‌పోర్టులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు వేర్వేరు విమానాల్లో వచ్చారు. వీరిని…

జువెలరీ షాపులో చోరి , 40 తులాల బంగారం అపహరణ

రంగారెడ్డి : జిల్లాలోని మహేశ్వరం మండలం తక్కుగూడలో జువెలరీ షాపులో చోరీ జరిగింది. దుండగులు 40 తులాల బంగారం, 12 కేజీల వెండిని అపహరించారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

అటవీ ప్రాంతంలో గుర్తతెలియని వ్యక్తి హత్య

ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎల్మినేడు-కొంగరకలన్‌ గ్రామాల మద్య అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.మృతదేహం వద్ద ఓ ద్విచక్రవాహనం ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

అప్పుల భారంతో యువరైతు ఆత్మహత్య

పరిగి (రంగారెడ్డి ): పుడమితల్లిని నమ్ముకున్న ఆ అన్నదాత కుటుంబంతో కలిసి ఆరుగాలం చెమటోడ్చాడు. కాలం కలిసిరాకపోవడంతో అప్పులే మిగిలాయి. రుణం తీరే మార్గం కానరాకపోవడంతో మనోవేనదకు గురై ఉరివేసుకుని తనువు చాలించాడు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి…

జీహెచ్‌ఎంసీలో విలీనం వద్దంటూ మహాధర్న

రంగారెడ్డి : జీహెచ్‌ఎంసీలో విలీనం చేయొద్దంటూ రాజేంద్రనగర్‌ మండలంలోని 14 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నార్సింగి చౌరస్తాలో మహాధర్నాకు దిగారు.

రాజేంద్రనగర్‌లో ఉద్రిక్తత

రంగారెడ్డి : రాజేంద్రనగర్‌ ఎన్జీరంగా విశ్వవిద్యాలయ విద్యార్థులు బంద్‌కు మద్దతుగా ఆందోళనకు దిగారు. రోడ్డుపై ఆందోళనకు దిగిన విద్యార్ధులపై తిరుపతి నుంచి వస్తున్న బస్సులపై రాళ్లువేశారని ఆరోపిస్తూ పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు.దీంతో విద్యార్థులకు పోలీసులకు మద్య యుద్ద వాతావరణం…