Sunday, 29 November 2026

వార్తలు

చాప్రా విషాద ఘటనలో అరెస్టయిన ప్రిన్సిపల్‌

బీహార్‌,(జనంసాక్షి): చాప్రా మధ్యాహ్న భోజనం కల్తీ ఘటనలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మీనాదేవిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలు మీనాదేవిని పోలీసులు చాప్రాలో అదుపులోకి తీసుకున్నారు. మీనాదేవిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్న భోజనం తిని 23 మంది విద్యార్థులు మృత్యువాత…

కూలిన హెలికాప్టర్‌: ఇద్దరు మృతి

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): కేదార్‌నాథ్‌ వద్ద బుధవారం హెలికాప్టర్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో సహా ఇద్దరు మృత్యువాత పడ్డారు.

అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ విచారణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): అనర్హత పిటిషన్లపై స్పీకఱ్‌ నాదెండ్ల మనోహర్‌ విచారణ జరిపారు. స్పీకర్‌ ఎదుట విచారణకు చిన్నం రామకోటయ్య గంగుల కమలాకర్‌, టీడీఎల్పీ విప్‌ నరేంద్ర హాజరయ్యారు.

భారత్‌ విజయలక్ష్యం 229 పరుగులు

హరారే,(జనంసాక్షి): భారత్‌- జింబాబ్వే జట్ల మధ్య ఇవాళ తొలి వన్డే జరిగింది. ఈ వన్డేలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. భారత్‌ విజయలక్ష్యం 229 పరుగులు..

మార్కెట్లో ప్రవేశపెట్టిన బ్లాక్‌బెర్రీ నుంచి రెండు కొత్త ఫోన్లు

హైదరాబాద్‌: వినియోగదారుల కోసం బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ ఫోన్లను బుధవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. బ్లాక్‌బెర్రీ 10 స్మార్ట్‌ఫోన్‌ , బ్లాక్‌ బెర్రీ క్యూ5 స్మార్ట్‌ ఫోన్‌లను ఈ రోజు హైదరాబాద్‌లో విడుదల చేసింది. క్యూ5 స్మార్ట్‌ ఫోన్‌ క్వెర్టీ…

నటి మంజుల అంత్యక్రియలు పూర్తి

చెన్నై,(జనంసాక్షి): నటి మంజుల అంత్యక్రియలు ముగిశాయి. ఈ  మధ్యాహ్నం పోరూర్‌ శశ్మానవాటికలో మంజుల భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె చితికి భర్త విజయ్‌కుమార్‌ నిప్పంటించారు. సినిమా ప్రముఖులు, అభిమానులు అశ్రునయనాలతో ఆమెకు తుది వీడ్కోలు పలికారు. 59 ఏళ్ల…

మాజీ సర్పంచ్‌పై కత్తులతో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

వరంగల్‌,(జనంసాక్షి): ఆత్మకూరు మండలంలో మాజీ సర్పంచ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. బాధితుడి సరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇరాక్‌లో ఉగ్రవాదుల దాడిలో 9 మంది జవనులు మృతి

బాగ్దాద్‌: ఇరాక్‌లో ఉగ్రవాదుల దాడిలో 9మంది పోలీసులు మృతి చెందారు. మోసుల్‌ అనే పట్టణంలో భద్రతాదళాలకు చెందిన ఒక భవనంపై మిలిటెంట్లు జరిపిన దాడిలో తొమ్మండుగురు పోలీసులు చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

ఆన్‌లైన్‌లో ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయనున్న భన్వర్‌లాల్‌

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ ఓటరు నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. అక్టోబరు 31 లోపు నమోదు చేసుకున్న వారికి డిసెంబరు లోపు ఓటరు కార్డు పంపిణీ చేస్తామని భన్వర్‌లాల్‌ తెలిపారు.

సహారాకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ

ఢిల్లీ,(జనంసాక్షి): సహారాకు చెందిన రెండు సంస్థలకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. మదుపుదారలకు డబ్బులు తిరిగి చెల్లించాలన్న ఆదేశాలను పాటించలేదని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం నోటీసులు జారీ చేసింది.