Sunday, 29 November 2026

వార్తలు

భద్రతా సిబ్బందికి చిక్కిన మావోయిస్టులు

ఒడిశా: మల్కన్‌గిరి జిల్లాలో భద్రతా సిబ్బంది ఇద్దరు మావోయిస్టులను పట్టుకున్నారు. పట్టుబడినవారిలో మావోయిస్టు కమాండెంట్‌ చంటి, మంగరాజు హంటల్‌ ఉన్నట్లు భద్రతా సిబ్బంది తెలిపారు. పట్టుబడిన ఇద్దరు మావోయిస్టులు బలిమెల, చిత్రకొండ ఘటనలో పాల్గొన్నట్లు సమాచారం.

గోదావరి ఉద్థృతి వల్ల స్తంభించిన రాకపోకలు

భద్రాచలం: గోదావరి వరద ఉద్ధృతి నిలకడగా కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద ఈ రోజు ఉదయం 10గంటలకు 56.9 అడుగుల వద్ద గోదావరి నీటిమట్టం నిలకడగా ఉంది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నందిగామ,…

అదుపుతప్పి పోలాల్లోకి దూసుకెళ్లిన ఆరీస్టీ బస్సు

ఉప్పునుంతల: మహబూబ్‌నగర్‌ జిల్లా ఉప్పునుంతల మండలంలోని ఉప్పరపల్లి నుంచి అచ్చంపేటకు 120 మంది ప్రయాణికులతో వెళ్తున్న అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం నుంచి ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. బస్సు కమాన్‌పట్టి…

ముళ్లపొదల్లో పసికందు మృతదేహం

కోస్గి: మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గి పట్టణంలో ముళ్ల పొదల్లో ఉన్న పసికందు మృత దేహాన్ని స్థానికులు గుర్తించారు. పదిరోజుల వయస్సున్న మగ బిడ్డను గుర్తు తెలియని మహిళ ముళ్లపొదల్లో వదిలేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. పందులు దాడిచేసి పీక్కు తినడంతో…

పట్టాలుతప్పడంతో ఘోర రైలు ప్రమాదం

స్పెయిన్‌: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శాంటియాగో  డీ కంపోస్టిలాలోని నార్త్‌ స్పానిష్‌ సిటీలో రైలు పట్టాలుతప్పడంతో దాదాపు 60 మందికి పైగా మృతిచెందగా 70 మంది వరకు గాయపడ్డారు. ప్రమాద సమయంలో రైల్లో 218మంది ప్రయాణికులు…

జలాశయాల్లోకి భారీగా చేరుతున్న వరద నీరు

కర్నూలు: ఎగువన కురుస్తున్న వర్షాలకు జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర జలాశయం ఇన్‌ఫ్లో 88,627 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 86,456 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 2లక్షల 15వేల 190 క్యూసెక్కులుగా ఉంది.

ఉపాధిహామీ కూలీల ఆందోళన

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): బెల్లంపల్లి మండలంలో ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన రూ. 7.80 లక్షలు డ్రా చేసుకుని సీఎస్పీ మాధవి పారిపోయారు. దీంతో ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఆందోళనకు గురవుతునానఉ. సీఎల్పీ మాధవిపై కూలీలు స్థానిక ఎంపీడీవోకు ఫిర్యాదు…

మిర్యాలగూడలో భారీ చోరి

నల్లగొండ,(జనంసాక్షి): మిర్యాలగూడ బండారిగడ్డలో భారీ చోరి జరిగింది. కారులో ఉంచిన రూ.20 లక్షల నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ప్రధానికి సీపీఐ కార్యదర్శి సురవరం లేఖ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు బుధవారం లేఖ రాశారు. త్వరగా తెలంగాణపే ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో కోరారు.