Sunday, 29 November 2026

వార్తలు

ప్రారంభమైన జాతీయ సెయిలింగ్‌ పోటీలు

హైదరాబాద్‌: నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో 28వ జాతీయ లేజర్‌ సెయిలింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌ సెయిలింగ్‌ వీక్‌ పేరుతో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 28 వరకు జరిగే పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ క్లబ్‌ల నుంచి…

పోలీసుల అదుపులో మంత్రి విశ్వరూప్‌ కుమారుడు

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంత్రి విశ్వరూప్‌ కుమారుడు కృష్ణరెడ్డిపై ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. భూవివాదంలో తనపై దాడి చేశారంటూ రాఘవులు అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూసు పమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

2 జీ కేసులో సుప్రీంకోర్టుకు కనిమొళి

ఢిల్లీ: 2 జీ స్పెక్ట్రమ్‌ కేసులో తనపై అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ డీఎంకే ఎంపీ కనిమొళి సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. 2 జీ కుంభకోణంలో అవినీతికి పాల్పడినట్లు కనిమొళి ఆరోపణలు ఎదుర్కొనడమే కాక అరెస్టై కొంతకాలం జైల్లో ఉన్న…

మంచి నాయకుణ్ణి ఎన్నుకోమని ముందే చెప్పా చంద్రబాబు

హైదరాబాద్‌: తొమ్మిదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని, సర్పంచులుగా మంచి నాయకుణ్ణి ఎన్నుకోమని ముందు నుంచే చెప్పానని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు సహకరించినందుకు…

28న కమ్యూనిస్టు పార్టీల సదస్సు: సీపీఐ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ సాదన కోసం ఈ నెల 28న హైదరాబాద్‌లో ఐదు కమ్యూనిస్టు పార్టీల సదస్సు నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  నారాయణ తెలిపారు. హైదరాబాద్‌ను కొంత కాలం ఉమ్మడి రాజధానిగా ఉంచితే మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎంసెట్‌ అనుబంధ ర్యాంకుల విడుదల

హైదరాబాద్‌: ఎంసెట్‌ అనుబంధ ర్యాంకులను జేఎన్‌టీయూ నేడు విడుదల చేసింది. ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలతో ఎంసెట్‌ అనుబంధ ర్యాంకుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచింది.

ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఆగస్టులో రచ్చబండ

హైదరాబాద్‌: సచివాలయంలో భేటీ ఆయిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆగస్టులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రచ్చబండ కార్యక్రమ తేదీలను సీఎం సమక్షంలో మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేయనుంది.

ఏపీఐఐసీపై సీఎం కిరణ్‌ సమీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో ఏపీఐఐసీపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సబావేశానికి మంత్రి గీతారెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు.

రాష్ట్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ

హైదరాబాద్‌: తొలివిడత జరిగిన పంచాయతీ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం బెలుతూరు పంచాయతీకి రీకౌంటింగ్‌ జరపాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

ఐకాస ధర్నా ఆగస్టు 1కి వాయిదా

హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద గురువారం నిర్వహించాల్సిన ధర్నాను ఆగస్టు ఒకటికి వాయిదా వేసినట్లు టీఎన్జీవో నేత శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. జన చైతన్య యాత్రను ప్రస్తుతం వాయిదా వేసినట్లు చెప్పారు. ఆగస్టు ఒకటిన ధర్నా తర్వాత యాత్రపై చర్చించి…